అదరగొట్టిన భారత అమ్మాయిలు..
ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం
మహిళల క్రికెట్ ఫైనల్లో శ్రీలంకపై 147 పరుగుల ఘన విజయం
బ్యాటింగ్ లో చెలరేగిన స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49నాటౌట్)
కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన దీప్తి శర్మ
ఆసియా క్రీడలు 2026లో భారత్ బంగారు బోణీ కొట్టింది. మహిళల క్రికెట్ ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ఏకంగా 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత మహిళల జట్టు తమ గోల్డ్ మెడల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 వరుగులు చేసి భారీ స్కోరుకు బలమైన పునాది వేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చి వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఆఖరి ఓవర్లలో విధ్వంసం సృష్టించింది. కేవలం 22 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు సాధించి జట్టు స్కోరును 200 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించింది. వీరిద్దరి మెరువులతో లంక బౌలర్లకు చుక్కలు కనిపించాయి. అనంతరం 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి కుప్పుకూలింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో లంక బ్యాటర్లు వరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా స్పిన్నర్ దీప్తి శర్మ తన మాయాజాలంతో లంక వతనాన్ని శాసించింది. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో శ్రీలంక జట్టు 69 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రేయాంక పాటిల్ చివరి వికెట్ తీయడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
దేశం గర్విస్తోందంటూ జట్టును అభినందించిన ప్రధాని మోదీ
ఆసియా క్రీడలు-2026లో భారత్ స్వర్ణ పతకాల ఖాతాను ఘనంగా ప్రారంభించింది. భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి, ఈ ఎడిషన్‌లో దేశానికి తొలి బంగారు వతకాన్ని అందించింది. ఫైనల్ పోరులో శ్రీలంకను 147 పరుగుల భారీ తేడాతో ఓడించి, వరుసగా రెండోసారి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కార్ సారథ్యంలోని టీమిండియా టోర్నీ ఆద్యంతం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ చారిత్రక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. "భారత క్రికెట్‌కు ఇదొక అద్భుతమైన విజయం. మన క్రీడాకారిణులు పూర్తి ఆధివత్యం ప్రదర్శించడం అభినందనీయం. వారి ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, సమష్టి కృషి అమోఘం. ఈ విజయంతో దేశం గర్విస్తోంది. మీరు యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారు" అని మోదీ ప్రశంసించారు. మరోవైపు ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఎంఎంఏ విభాగంలో పతకం సాధించిన సుచికా తరియల్ను కూడా ప్రధానమంత్రి అభినందించారు. రాష్ట్రపతి ద్రావది ముర్ము సైతం భారత జట్టును అభినందించారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపో తుందని, రాబోయే తరాలకు, ముఖ్యంగా దేశంలోని యువతకు ఇది గొప్ప స్పూర్తిదాయకమని కొనియా డారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పందిస్తూ. షఫాలీ వర్మ, స్మృతి మంధానల అద్భుత భాగస్వా మ్యాన్ని, బౌలర్ల ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ చారిత్రక విజయంతో భారత మహిళా జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.