వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్ లోనూ మీరాబాయి చానుకు స్వర్ణం స్నాచ్ విభాగంలో సరికొత్త గేమ్స్, కామన్వెల్త్ రికార్డుల నమోదు పురుషుల 60 కేజీల విభాగంలో రిషికాంత సింగ్ు రజత పతకం రిషికాంత సైతం స్నాచ్ కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నమోదు గ్లాస్గో క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు తమ సత్తాను ఘనంగా చాటుకున్నారు. భారత వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో మరో స్వర్ణాధ్యాయాన్ని లిఖిస్తూ స్టార్ లిఫ్టర్, ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను మహిళల 48 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఆదివారం జరిగిన ఈ పోటీలో అద్వితీయ ప్రదర్శన కనబరిచిన ఆమె, వరుసగా మూడోసారి కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం గెలిచి చారిత్రాత్మక హ్యాట్రిక్ పూర్తి చేసింది. ఈ క్రమంలో సరికొత్త గేమ్స్, కామన్వెల్త్ రికార్డులను సైతం బద్దలు కొట్టింది. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన మీరాబాయి, ఈ పోటీలో ఆరంభంలో కాస్త తడబడింది. స్నాచ్ విభాగంలో 82 కేజీల బరువును తొలి ప్రయత్నంలో విఫలమైనప్పటికీ, రెండో ప్రయత్నంలో దానిని విజయవంతంగా ఎత్తింది. ఇక మూడో ప్రయత్నంలో ఏకంగా 85 కేజీల బరువును అవలీలగా ఎత్తి, సరికొత్త గేమ్స్, కామన్వెల్త్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. దీంతో క్లీన్ అండ్ జెర్క్ విభాగానికి ముందే ప్రత్యర్థులపై 8 కిలోల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్లీనూ తొలి ప్రయత్నంలో విఫలమైనా, ఛాంపియనక్కు తగ్గ రీతిలో పుంజుకుని రెండో ప్రయత్నంలో 105 కేజీల బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది. 2018 గోల్డ్ కోస్ట్, 2022 జర్మింగ్ హామ్ కామన్వెల్త్ క్రీడల తర్వాత మీరాబాయికి ఇది వరుసగా మూడో కామన్వెల్త్ స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు, పురుషుల 60 కేజీల విభాగంలో రిషికాంత సింగ్ చనమమ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం గెలిచి ఈ క్రీడల్లో భారత్ పతకాల ఖాతాను తెరిచాడు. రిషికాంత స్నాచ్ విభాగంలో 121 కేజీల బరువును ఎత్తి గతంలో ఉ న్న 120 కేజీల కామన్వెల్త్ గేమ్స్ రికార్డును అధిగమించాడు. అనంతరం క్లీన్ అండ్ జెట్స్‌లో 143 కేజీలు ఎత్తడంతో, మొత్తంగా 264 కేజీలతో వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఈవెంట్ మలేషియాకు చెందిన విన్ కస్దాన్ మహ్మద్ అనిక్ (273 కేజీలు) స్వర్ణం గెలుచుకోగా, కెన్యాకు చెందిన జాషువా అముంగా (260 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.