ఏఐ. వాణిజ్యంలో కలిసి పనిచేస్తాం
స్పిల్ ప్రెసిడెంట్ పై హెర్మిషన్.
ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్ అత్యంత కీలకమైన శక్తిగా ఎదుగుతోందని స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ గై పార్మెలిన్ ప్రశంసించారు. గ్లోబల్ గవర్నెన్స్, సాంకేతిక రంగాలలో కూడా న్యూఢిల్లీ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ విచ్చేసిన ఆయన, ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం ఉమ్మడి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రపంచం ఒకవైపు రాజకీయంగా, భౌ గోళికంగా విభజనకు గురవుతున్న తరుణంలో భారత్ వంటి దేశాలతో భాగస్వామ్యం అత్యంత కీలకం అని మాట్లాడారు. ఏ అంతర్జాతీయ వేదిక అయినా భారత్ చర్చలు, సహకారానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా తాము అనుసరిస్తామని తెలిపారు. గ్లోబల్ టెక్నాలజీ చర్చల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచడంలోనూ భారత్ అసాధారణ నాయకత్వ పటిమను ప్రదర్శించిందని పార్మెలిన్ అన్నారు. ఈ క్రమంలోనే 2026 ఫిబ్రవరిలో న్యూఢిల్లీ వేదికగా భారత్ నిర్వహించిన 'ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026' గొప్ప విజయాన్ని సాధించిందని ప్రశంసలు కురిపించారు. దీనికి 88 దేశాలు, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఆమోదించాయని ఆయన గుర్తు చేశారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ విధానం ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సాంకేతిక ప్రయోజనాలు కొన్ని దేశాలు, సంస్థలకే పరిమితం కాకుండా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చేరేలా భాగస్వామ్యం కల్పించడానికి, ఏఐ పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వడానికి స్విట్జర్లాండ్ కృషి చేస్తుందన్నారు. 2027 జూన్‌లో జెనీవాలో స్విట్జర్లాండ్ నిర్వహించబోయే తదుపరి గ్లోబల్ ఏఐ నమిట్కు భారత్‌ను కీలక భాగస్వామిగా వరిగణిస్తున్నట్లు పార్మెలిన్ పేర్కొన్నారు. ఇక్కడ ఆమోదించిన 'న్యూదిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్' మార్గదర్శకాల ఆధారంగానే తాము కూడా ముందుకు సాగుతామని వెల్లడించారు. భారత్- స్విట్జర్లాండ్ ఆర్థిక సంబంధాల్లో ఇండియా- యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్య జరిగిన (ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్టనర్షిప్ అగ్రిమెంట్) కీలకంగా మారుతోంది. భారత్, స్విస్, నార్వే, ఐస్లాండ్, లిక్టెన్ స్టెయిన్‌లతో కూడిన మధ్య కుదిరిన ఈ డీల్ 2025, అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఈ డీల్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, దీని అమలు తీరుపై తాము చాలా సంతోషంగా ఉన్నామని పార్మెలిన్ వెల్లడించారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చాక స్విస్ కంపెనీల నుంచి ఆసక్తి బాగా పెరిగిందన్నారు. రానున్న సంవత్సరాల్లో భారత్-స్విట్జర్లాండ్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలకంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ ఒకవైపు స్విన్కు వినూత్న సాంకేతికతలు, పెట్టుబడి సామర్థ్యం, అంతర్జాతీయ కంపెనీలు ఉండగా, భారత్‌కు భారీ మార్కెట్, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు, వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్నాయని ఆయన వివరించారు. ఇలా రెండు వైపులా బలబలాలు ఇరు దేశాలకు మరింత ప్రయోజనం చేకూర్చే అవకాశాల్ని కల్పిస్తున్నాయని స్విస్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు. రవాణా, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మామ్యాటికల్స్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో స్విస్ కంపెనీలు ఇప్పటికే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయని వెల్లడించారు.
మరోవైపు భారత్- స్విట్జర్లాండ్ స్నేహం శతాబ్దాల నాటిదని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు చేపట్టారు. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్టం చేసేలా అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. రాబోయే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు లక్ష్యంగా ప్రతిష్టాత్మక ఆర్ధిక రోడ్మ్యామ్ను ఆవిష్కరించారు. స్విస్ అధ్యక్షుడుగై పార్మెలిన్‌తో ద్వైపాక్షిక చర్చల అనంతరం నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీ ఈ మే-రకు ప్రసంగించారు. భారత్- స్విట్జర్లాండ్ స్నేహం శతాబ్దాల నాటిది. ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతికత నేడు మన పునాదికి బలమైన స్తంభాలుగా ఉన్నాయి. నేటి శిఖరాగ్ర సమావేశంతో మన భాగస్వామ్యానికి కొత్త వేగాన్ని, కొత్త శిఖరాలను అందించబోతున్నాం. ఇది పెట్టుబడి, ఆవిష్కరణ, ఉ ద్యోగాలు, పరస్పర శ్రేయస్సు కోసం రూపొందించిన ఒక ప్రతిష్టాత్మక ప్రణాళిక. దీనితో రాబోయే 15 ఏళ్లలో భారతదేశంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి, 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సాధిస్తాం. స్విట్జర్లాండ్‌లో భారతదేశ ఎగుమతులకు మార్కెట్'ను పెంచడానికి, రెండు దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేయడానికి మేము అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. దీనివల్ల స్విట్జర్లాండ్ కు భారతదేశ వ్యవసాయ, ఫార్మా, వస్త్ర, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతి పెరుగుతుంది. అదే సమయంలో బయోటెక్, లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, వుడ్ ప్రాసెసింగ్ వంటి భారతదేశంలోని ముఖ్యమైన రంగాల్లోకి కొత్త స్విస్ పెట్టుబడులను ఆకర్షిస్తాం. ప్రజల మధ్య సంబంధాలే మన భాగస్వామ్యానికి అతిపెద్ద జలం, ఈ రోజు నంతకం చేసిన మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్షిప్ అగ్రిమెంట్, యంగ్ ప్రొఫెషనల్స్ అగ్రిమెంట్ స్విట్జర్లాండ్ లో భారతీ-య విద్యార్థులు, పరిశోధకులకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్దమైన పాలన, సంప్రదింపులు, దౌత్యం వట్ల భారత్? స్విట్జర్లాండ్ ఒకే విధమైన నిబద్ధతను పంచుకుంటున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఆరు దేశాలు తమ సహకారాన్ని కొనసాగిస్తాయని అభిప్రాయవడ్డారు. పెరుగుతున్న అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు అత్యంత కీలకమని ఇరు దేశాలు భావిస్తున్నాయని వ్యాఖ్యానించారు, "భారత్, స్విట్జర్లాండ్ రెండూ ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలన, సంప్రదింపులు, దౌత్యాన్ని విశ్వసిస్తాయి, ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం మేం కలిసి పనిచేస్తాం. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇలా ఎక్కడైనా శాంతి కోసం చేసే ప్రతి అర్ధవంతమైన ప్రయత్నానికి భారతదేశం నిరంతరం మద్దతు ఇచ్చింది. పెరుగుతున్న ప్రపంచ నవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు అవనరమనే విషయంలో కూడా మేమిద్దరం ఏకీభవిస్తున్నాం." అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. భారత్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలు తర్వాత ద్వైపాక్షిక సంబంధాల్లో వేగం పెరుగుతుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడు గై పార్మెరిన్ను ప్రశంసించారు. "స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి స్వాగతం పలకడం నాకు చాలా సంతోషంగా ఉంది, అన్నింటికంటే ముందు భారత్-స్విట్జర్లాండ్ సంబంధాల పట్ల ఆయన నిబద్ధతను నేను అభినందిస్తున్నాను. గత ఏడాది అక్టోబర్ లో ఆయన వ్యక్తిగత మద్దతుతోనే మేము దేశాలతో చారిత్రాత్మక వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశాం. యూరోపియన్ ఆర్థిక కూటమితో భారతదేశం కుదు-ర్చుకున్న మొదటి స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ఇదే." అని ప్రధాని మోదీ అన్నాడు.