పడిక్కల్ భారీ ఇన్నింగ్స్ తో పటిష్ఠ స్థితి గాలేలో టీమిండియా-శ్రీలంక తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీ (167) కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ అర్ధశతకాలు రెండో రోజు ముగిసేసరికి 9 వికెట్లకు 460 పరుగులు చేసిన టీమిండియా లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్యకు 4, కేశర నువంతకు 3 వికెట్లు
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్పి టీమిండియా పూర్తి పట్టు సాధించింది. యువ ఓపెనర్ డేవదత్ పడిక్కల్ (167) బాదిన అద్భుత శతకానికి, కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) సాధించిన కీలక అర్ధ శతకాలు తోడవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా రెండో రోజు ఆట అలస్యంగా ప్రారంభమైనప్పటికీ, భారత బ్యాటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. వర్షం వల్ల తొలి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో, రెండో రోజు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట తిరిగి ప్రారంభమయ్యాక భారత బ్యాటర్లు వేగంగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా వడిక్కల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ భారీ శతకాన్ని నమోదు చేశాడు. అతనికి తోడుగా రాహుల్, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారీ స్కోరు దిశగా సాగుతున్న భారత్‌ను శ్రీలంక స్పిన్నర్లు కొంతవరకు కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అరంగేట్ర స్పిన్నర్ కేశర సువంత 3 వికెట్లు పడగొట్టగా, సీనియర్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 4 వికెట్లతో రాణించాడు. రెండో కొత్త బంతితో లంక బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా (16)ను సువంత ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ దూకుడుగా ఆడాడు. కేవలం 68 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేసి జట్టు స్కోరును 400 దాటించాడు. అయితే, అర్థ శతకం పూర్తయిన వెంటనే జయసూర్య బౌలింగ్‌లో స్లిప్‌లో ఉ న్న కెప్టెన్ ధనంజయ డిసిల్వా అద్భుతమైన డ్రైవింగ్ క్యాచ్ పట్టడంతో జురెల్ వెనుదిరిగాడు. చివర్లో మహమ్మద్ సిరాజ్, మానవ్ సుతార్ (24) వేగంగా పరుగులు జోడించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. క్రీజులో కుల్డీప్ యాదవ్ (12), ప్రసిద్ధి కృష్ణ (1) ఉన్నారు. కాగా, టీమిండియా తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి, మూడో రోజు ఉదయాన్నే శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించి, వారి లైనవ్ ను ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది.