అభిషేక్ విధ్వంసం..30 బంతుల్లోనే శతకం
127 రన్స్ తో అఫ్ఘాన్ చిత్తు
నితీశ్, బిష్ణోయ్స్ కు మూడేసి వికెట్లు
న్యూఢిల్లీ: డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 108) మరోసారి విజృంభించాడు. గురువారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 30 బంతుల్లోనే రికార్డు శతకం బాదేశాడు. అతడి ధాటికి సంజూ శాంసన్ (35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) నిలకడ తోడయ్యింది. అనంతరం భారత బౌలర్ల విజృంభణకు అఫ్ఘాన్ బ్యాటర్లంతా కలిసి అభిషేక్ స్కోరును కూడా అందుకోలేకపోయారు. దీంతో భారత్ 127 వరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే 3-0తో ఈ సిరనను సైతం క్లీన్‌స్విప్ చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 221 పరుగులు చేసింది. శ్రేయాస్ (29) ఫర్వాలేదనిపించాడు. ఒమర్జాయ్కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో అఫ్ఘాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలింది. బ్రాన్ (25) టాప్ స్కోరర్, నితీశ్, బిష్ణోయ్‌లకు మూడేసి.. అక్షర్‌కు 2 వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాన్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా అభిషేక్‌కు దక్కింది. పేకమేడలా..: భారీ ఛేదనలో అఫ్ఘాన్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి కనీసం వంద వరుగులైనా చేయలేక చతికిలపడింది. నాలుగో ఓవర్లోనే గుర్బాజ్‌ను స్పిన్నర్ అక్షర్ అవుట్ చేయడంతో తడబాటు ఆరంభమైంది. పవర్స్లోలో జట్టు 51 పరుగులు చేసినప్పటికీ 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. నితీశ్ 12వ ఓవర్లో ఏకంగా నబీ (6), ఒమరాయ్ (17), ముజీబుర్ (0)లను పెవిలియన్‌కు చేర్చగా అఫ్ఘాన్ 82/8 స్కోరుతో ఓటమి అంచున నిలిచింది. చివరకు మరో 35 బంతులుండగానే భారత్ మ్యార్ను ముగించింది.
ఎడా పెడా: టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిషేక్ వర్మ రఫ్పాడించాడు. రెండో ఓవర్లో 6,4,6తో మొదలెట్టిన అభిషేక్ మూడో ఓవర్లో 23 పరుగులు చేశాడు. ఇక సబీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనైతే 29 రన్స్ సమకూరాయి. దీంతో పవర్ ప్లేలోనే జట్టు 100 పరుగులతో నిలిచింది. అభిషేక్ ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి 30 బంతుల్లోనే శతకం వాదేశాడు. అయితే కాసేపటికే స్పిన్నర్ రషీద్ అతడి విధ్వంసానికి బ్రేక్ వేయడంతో తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఆఫాన్ బౌలర్లు పట్టు సాధించడంతో భారత్ వికెట్లను వేగంగానే కోల్పోయింది. తిలక్ (2) రనౌట్ కాగా.. శాంసను ఒమర్జాయ్ అవుట్ చేశాడు. చివరి ఐదు ఓవర్లలో 37 పరుగులే చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది.