ములానీ స్పిన్ మాయ.. కుశాగ్ర సెంచరీ..
ఆస్ట్రేలియా-ఏతో తొలి మ్యాచ్ లో భారత్-ఏ 162 వరుగుల తేడాతో ఘన విజయం
మ్యాచ్ లో మొత్తం ఏడు వికెట్లతో రాణించిన షామ్స్ ములానీ
తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన కుమార్ కుశాగ్రకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'
కెప్టెన్ దేవదత్ పడిక్కల్ అర్ధశతకంతో రెండో ఇన్నింగ్స్ లో కీలక పాత్ర
భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ 200 వరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా-ఏ
ఆస్ట్రేలియా-ఏతో జరిగిన తొలి నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. పుదుచ్చేరి సీఏపీ-సీషెమ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 162 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షామ్స్ ములానీ రెండో ఇన్నింగ్స్ మూడు వికెట్లు పడగొట్టి, మ్యాచ్ మొత్తంలో 124 వరుగులిచ్చి 7 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా, చివరి రోజైన శుక్రవారం 55/2 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా-ఏ, భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. తొలి గంటలోనే మీడియం పేసర్ అస్నుల్ కంబోజ్, ఓపర్నైట్ బ్యాటర్లు నాథన్ మెక్స్వినీ (35), కెప్టెన్ పీటర్ హ్యాండ్స్ కోంట్ (16)లను ఔట్ చేసి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ తర్వాత పేసర్ తుషార్ దేశ్‌పాండే పరున బంతుల్లో జోష్ ఫిలిప్, లియామ్ స్కాట్లను పెవిలియన్‌కు పంపి పతనాన్ని శాసించాడు. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా-ఏ 185/7 స్కోరుతో కష్టాల్లో పడింది. లంచ్ తర్వాత షామ్స్ ములానీ మిగిలిన వికెట్లను పడగొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ఫెర్టస్ ఓ'నీల్ (47) టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరికి ఆస్ట్రేలియా-ఏ 55.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్-ఏ, తమ రెండో ఇన్నింగ్స్ కెప్టెన్ దోపదత్ వడిక్కల్ (59) బాధ్యతాయుతమైన అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ (39)తో కలిసి పడిక్కల్ రెండో వికెట్‌కు 68 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, పడిక్కల్ ఔటైన తర్వాత భారత్-ఏ అసూహ్యంగా కుప్పకూలింది. చివరి ఆరు వికెట్లను కేవలం 18 పరుగులకే కోల్పోయి 199 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీతో ఆకట్టుకున్న కుమార్ కుశాగ్ర (46 నాటౌట్) చివరి వరకు పోరాడాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీతో భారత్-ఏ భారీ స్కోరుకు పునాది వేసిన కుమార్ కుశాగ్రకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇరు మధ్య రెండో మ్యాచ్ సెప్టెంబర్ 29 అక్టోబర్ 2 వరకు ఇదే వేదికపై ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ -2: 384 199., ఆస్ట్రేలియా-ఏ: 171
డె 200 (ఫెర్టన్ ఓ'నీల్ 47; తుషార్ దేశ్ పాండే 3-14, షామ్స్ ములానీ 3-57)