తొలి స్వదేశీ ప్లీట్ సపోర్ట్ షిప్ ఎఫ్ఎస్ఎస్-5కు రక్షణ
మంత్రి రాజ్‌నాథ్ శంకుస్థాపన విశాఖను మెరైన్
ఇండస్ట్రియల్ హబ్ తీర్చిదిద్దాలి
రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్
విశాఖపట్నం, : విశాఖపట్నం మరో కీలక సముద్ర రక్షణ మైలురాయికి వేదికైంది. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎన్ ఎల్)లో దేశీయంగా నిర్మించిన తొలి క్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్-1) 'ఐఎన్ఎస్ సూర్య' మంగళవారం జలప్రవేశం చేసింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌకను ప్రారంభించడంతోపాటు ఐదో ప్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్-5)కు కీలకమైన కీల్ లేయింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే సందర్భంగా హెచ్ఎస్ఎల్లో ఆధునీకరించిన స్లిప్త్వో- 1, 300 టన్నుల సామర్థం కలిగిన గోలియత్ క్రను ప్రారంబిం చారు. ఈ మూడు కార్యక్రమాలు భారత నౌకానిర్మాణ సామర్థ్యాన్ని మరింత పెంచే కీలక ఘట్టాలని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఎఫ్ ఎస్ఎన్-1 జలప్రవేశం సాధించిన విజయానికి ప్రతీక... ఎఫ్ఎస్ఎస్-5కు కీల్ వేయడం భవిష్యత్తు సంకల్పానికి ప్రతీక.. కొత్త స్లిప్పో పెరుగుతున్న సామర్థ్యానికి నిదర్శనమన్నారు. నేవీ వైన్స్ వెలెనెస్ అసోసియేషన్ (ఎస్ డబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యక్షురాలు లైలాస్వామినాదన్ సాంప్రదాయిక లాంఛనాలను పూర్తి చేసిన తరువాత, ఎపిఎసిఎస్-1ను ప్రారంభిం చారు. ఎఫ్ఎస్ఎస్-1కు 'నూర్య' అనే పేరును పెట్టారు. ఆహ్వానితుల హర్షధ్వానాల మధ్య ఈ నౌకను బంగాళాఖాతం జలాల్లో ప్రవేశపెట్టారు. ఈ నౌకకు రూపురేఖలను దిద్దడమే కాకుండా దీనిని హెచ్ఎస్ఎల్ నిర్మించింది. ఓడనరుకుతో పాటు ద్రవ రూప పదార్థాలను తీసుకువెళ్లే సామర్థ్యాన్ని 'సూర్యకు జతపరిచారు. భారత నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో నుదూర సముద్ర కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్లేట్ సపోర్ట్ షిప్‌లు కీలకంగా ఉపయోగపడనున్నా యని రక్షణ మంత్రి తెలిపారు. యుద్ధ నౌకలకు ఇంధనం, ఇతర ద్రవ పదార్థాలు, సరకు, నిర్వహణ సహకారం అందించడంతోపాటు సముద్రంలోనే అవసరమైన సేవలను కొనసాగించేందుకు ఇవి దోహదపడతాయన్నారు. సూర్య నౌకలో అధిక సామర్థం కలిగిన సరకు, ద్రవ పదార్ధాల నిల్వ సదుపాయాలు, ప్రథమ శ్రేణి నిర్వహణ వర్మావు, మల్టీ రోల్ హెలికాప్టర్ల నిర్వహణకు హెలీకాఫ్టర్ డెక్, స్వీయ రక్షణ వ్యవస్థలు ఉంటాయని తెలిపారు. హెచ్‌ఎన్‌ఎల్ స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ నౌకలను నిర్మిస్తోంది.
45 వేల డీడబ్ల్యూటీ నౌకల నిర్మాణానికి..
ఆధునీకరించిన స్లిప్త్వో-4ను 45 వేల డిడబ్ల్యూటీ వరకు భారీ నౌకలను నిర్మించి, జలప్రవేశం చేయగలిగేలా విస్తరించి బలోపేతం చేశారు. స్లవ్వేలు-3, 4పై విస్తరించిన 300 బన్నుల గోలియత్ క్రేన్ భారీ నౌకా భాగాలను వేగంగా, కచ్చితంగా తరలించేందుకు ఉ పయోగపడనుంది. మేక్ ఇన్ ఇండియా కింద ఎల్అండ్రీ జియోస్ట్రక్చర్, కోనెక్రేన్స్ సహకారంతో దీనిని రూపొందించారు. స్వయం సమృద్ధి సాధించడం తొలి అడుగేనని, ప్రపంచ స్థాయి పోటీతత్వమే తదుపరి లక్ష్యమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నాణ్యత, వ్యయం, సాంకేతికత, ఉ త్పాదకం సకాలంలో నౌకల అందజేతలో ప్రపంచంలోని ప్రముఖ షిప్యార్ల లతో భారత సంస్థలు పోటీ వడాలని సూచించారు. హెచ్ఎస్ఎల్ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, విశ్వవిద్యాల యాలు, సాంకేతిక సంస్థలు, స్టార్జపిలను అనుసంధానించి సంపూర్ణ నౌకానిర్మాణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని అన్నారు. తూర్పు నౌకా దళ ప్రధాన కార్యాలయం, నేవల్ డాక్ యార్డ్, హెచ్ఎస్ఎల్, విశాఖప ట్నం పోర్టు వంటి కీలక సంస్థలు ఒకే నగరంలో ఉండటం విశాఖకు ప్రత్యేక బలమన్నారు. విశాఖపట్నాన్ని ప్రధాన మెరైన్ ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. మెరుగైన డిజైన్, వేగవంతమైన నిర్మాణం.. సకాలంలో సరఫరా.. సమర్ధవంతమైన నిర్వహణ" లక్ష్యంగా హెచ్ఎస్ఎల్ హెచ్ ముందుకు సాగాలని రక్షణ మంత్రి సూచించారు. దేశీయ నౌకానిర్మాణాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించి, స్నేహపూర్వక దేశాలకు నౌకలు, మరమ్మతు, నిర్వహణ, ఇంజనీరింగ్ సేవలు అందించే స్థాయికి భారతషిప్యోర్థులు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో నౌకాదళ ప్రధా నాధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాడన్ రోడ్లు భవనాలశాఖమంత్రి బిసి జనార్దన్ రెడ్డి, విశాఖ ఎంపీ శ్రీభర కుమార్, తూర్పు నౌకదళ వైస్ అడ్మిరల్ నంజయ్ జిల్లా, ఈస్టర్న్ శ్రీభరత్, రక్షణ ఉత్పత్తి కార్యదర్శి సంజీవ్ సీబోర్డుకు చెందిన కోస్తా తీర రక్షకదళ కమాండకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ డానీ మైఖేల్, హెచ్ఎసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు రియర్ అడ్మిరల్ (రిటైర్డ్) సి. రఘురామతో పాటు భారతీయ నౌకాదళానికీ, రక్షణ శాఖకీ చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు.