ఈ నెల 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ' మార్చ్
దేశవ్యాప్త ఆందోళనలకు కూటమి పిలుపు
అక్టోబర్ 6న విపక్ష ఎంపీల ప్రదర్శన..
కూటమి ఉద్యమ కార్యాచరణ ఖరారు
న్యూఢిల్లీ : ఓటరు జాబితా నవరణలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు ఇండియా కూటమి సిద్ధమైంది. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ఖరారు చేసింది. యువత, ఎన్జీవోలను కలుపుకుని అక్టోబర్ 2 నుంచి 8 వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలు చేపట్టనున్నారు. అలాగే జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయనున్నారు. అక్టోబర్ 6న విపక్ష ఎంపీలంతా ఎన్నికల సంఘం కార్యాల యం వరకు ర్యాలీగా చేపట్టనున్నారు. అక్టోబర్ రెండో వారంలో ప్రతిపక్ష నేతలంతా రాష్ట్రపతిని కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినతిపత్రం సమర్పించను న్నారు. దేశవ్యాప్తంగా 5 భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. వాటి తేదీలు, ప్రదేశాలు త్వరలో ప్రకటి స్తామన్నారు. గతంలో నోట్ బందీ చేసిన ప్రధాని మోదీ, ఇప్పుడు 'ఓట్ బందీ' ద్వారా ప్రజల ఓటు హక్కును కాలరా స్తున్నారని ఆరోపించారు. ప్రధాని, హోంమంత్రి ఈ ఓట్ల దొంగతనం వెనుక ఉండి ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకుం టున్నారని ఖర్గే ఆరోపించారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఈవీఎంలకు స్వస్తి పలికి బ్యాలెట్ పేపర్లను వాడాలని డిమాండ్ చేశారు. అలాగే సరకు ముందున్న ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు సంస్థలను బలహీనపరుస్తున్నారని, ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రభావానికి లోనవుతోందని ఖర్గే ఆరోపించారు. అక్రమ మార్గాల ద్వారా ఎన్నికల్లో గెలుస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల ప్రజాస్వామ్య పనితీరుకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు ఇండియా బ్లాక్ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతారు. అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపీలందరూ కలిసి ఎన్నికల సంఘం వద్దకు పాదయాత్ర చేస్తారు. ప్రతిపక్ష నాయకులు భారత రాష్ట్రవతి అపాయింట్మెంట్ కోరనున్నారు. అక్టోబర్ రెండోవారంలో మేము వారికి ఒక వినతిపత్రాన్ని సమర్పించనున్నాం. ప్రభుత్వం సృష్టిస్తున్న రాజ్యాంగ పరమైన అడ్డంకులను, మాకున్న ఇబ్బందులను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తాం. ప్రజలను ఇబ్బంది పెడుతూ వ్యవస? థలను నాశనం చేస్తూ వారి సొంత నిర్ణయాలతో నేడు ఈ దొంగల ప్రభుత్వాన్ని నడువుతున్నారని రాష్ట్రపతికి తెలియజేయా లనుకుంటున్నాం. ఈ విషయంలో మేం ఎంతవరకు విజయం సాధిస్తామనేది తర్వాత చూస్తాం. అక్టోబర్- నవంబర్ నెలల్లో ఐదు ప్రధాన ర్యాలీలు నిర్వహిస్తాం. ఇందుకు సంబంధించిన వేదికలు, తేదీలు త్వరలో ఖరారు చేస్తాం. నవంబర్ 1న ఢిల్లీలో ఒక ప్రధాన ర్యాలీని నిర్వహిస్తామని మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే హాజరయ్యారు. శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఇండియా కూటమి నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య నిర్మాణంపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, సీరసీ జ్ఞానేష్ కుమార్‌లు దాడి చేశారని అన్ని పార్టీలు భావిస్తున్నట్లు లోక్నభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారికి శిక్షపడేలా చూస్తామని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఈ పరిణామాలను అత్యంత కుంభకోణంతో కూడుకున్న విషయంగా మమతా బెనర్జీ అభివర్ణించారు. జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన్ను తొలగించకపోతే ఆందోళనలు ప్రతి మూలకూ విస్తరిస్తామని దీదీ హెచ్చరించారు. ప్రధాని మోదీ సైతం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు లోక్నభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సైతం సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్? వేదికగా మండిపడ్డారు. దేశంలో జీవితకాల సంపూర్ణ చట్టపరమైన రక్షణను అనుభవిస్తున్న ఏకైక పౌరుడు జ్ఞానేష్ కుమార్ అని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు.