ప్లేస్ నువ్వు చెబుతావా.. నన్ను చెప్పమంటావా?
జగన్‌కు మరోసారి లోకేశ్ సవాల్
డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి ఆయనకు తేడా తెలియదు
డీఎస్సీపై పేటెంట్ హక్కులు టీడీపీవే
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అసభ్య
వ్యాఖ్యలు చేసేవారిని వదిలిపెట్టం: లోకేశ్
కోవూరు టీడీపీ శ్రేణులతో భేటీ
కోవూరు: 'డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా!7 ప్లేస్ నువ్వు చెబుతావా! నన్ను చెప్పమంటావా!" అని వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి లోకేశ్ మరోసారి నవాల్ విసిరారు. ఆయనకు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఆయనలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేయడం రాష్ట్రానికే అవమానమన్నారు. 'జగన్ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నారు. ప్రజలు అమాయకులు కాదు. ఆయన నేర చరిత్ర వారికి తెలుసు. ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మరు' అన్నారు. బుధవారం నెల్లూరు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కోవూరులో జరిగిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీపై జగన్ అండ్ కో చేస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ అంటే డ్రగ్స్, శాండ్, చీప్ లిక్కర్ అమ్ముకోవడమని జగన్ అనుకున్నాడని, అందుకే ఐదేళ్ల కాలంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా రాష్ట్రమంతా విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అయ్యేలా పాలన సాగించాడని ధ్వజమెత్తారు. 'డీఎస్సీపై పేటెంట్ హక్కులు టీడీపీకి మాత్రమే ఉన్నాయి. గత తెలుగుదేశం పాలనలో పలుసార్లు డీఎస్సీ నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీ ద్వారా 16వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. తన ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వని జగన్.. మాపై నిందలు వేయడం హాస్యాస్పదం' అని అన్నారు.
వేమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వదలం
మహిళల గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా సహించేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై కొంతమంది రౌడీలు అనభ్యంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
బాబు జోలికి రావొద్దు..
ప్రతి నిమిషం ప్రజల కోసమే ఆలోచించే, శ్రమించే చంద్రబాబు గురించి మాట్లాడితే ప్రజలు హర్షించరని, ఆయన జోలికి వస్తే మాడి మసైపోతారని లోకేశ్ అన్నారు. సొంత బాబాయిని సైతం ఈ సైకో లేపేశాడని, దానిని నారాసుర రక్త చరిత్ర పేరుతో తమపై బురదజల్లడానికి ప్రయత్నించారని లోకేశ్ విమర్శించారు. గులకరాయి దెబ్బ తగిలిందని ఒకరోజు, ప్లాస్టర్ వేసుకుని మరొక రోజు సింపతీ కోసం తాపత్రయపడ్డారని ఎద్దేవా చేశారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ఓ నాయకుడు ప్రగల్భాలు పలికాడని, ఏమైందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.