అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన యువరాజ్
భారత క్రికెట్ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ.. జట్టులో గెలుపు సంస్కృతిని పెంపొందించి, ఛాంపియన్షిప్ సాధించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో యువీ తన బాధ్యతలను నిర్వహించనున్నాడు. తనకు ఈ అవకాశం లభించిన తీరును వివరిస్తూ.. "దాదా నన్ను పిలిచి, 'నా అసిస్టెంట్‌గా ఉ టావా?' అని అడిగాడు. దానికి నేను.. 'గత 25 ఏళ్లుగా మీకు అసిస్టెంట్‌గానే ఉన్నాను కదా, బహుశా అదే పని కొనసాగిస్తానేమో' అని నరదాగా సమాధానమిచ్చాను. ఈ బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతృప్తిని ఇస్తోంది" అని యువరాజ్ పేర్కొన్నాడు. గత కొన్నేళు గా తాను కోచింగ్ పాత్ర కోసం సిద్ధమవుతున్నానని, గంగూలీ తనకు ఎప్పుడూ పెద్దన్న వంటి వారని, ఆయన దిశానిర్దేశంలో జట్టు మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. కోచింగ్ విధానం గురించి వివరిస్తూ.. "ఈ స్థాయిలో ప్రతి ఆటగాడికి అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. ఫ్రాంచైజీ ఒక ఆటగాడిని ఎంపిక చేసిందంటే, వారి సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉందని అర్థం. ఆటగాళ్లు కూడా తమ ప్రతిభపై తాము విశ్వాసం ఉ ంచుకోవాలి" అని యువరాజ్ సూచించాడు. ఢిల్లీ జట్టు బ్యాటింగ్ లైనపన్ను ప్రశంసిస్తూ.. కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు జట్టులో ఉండటం సానుకూల అంశమని పేర్కొన్నారు. "ముందుగా ప్లేఆఫ్స్క అర్హత సాధించడం మా ప్రథమ లక్ష్యం. అయితే, అంతిమంగా ఛాంపియన్ షిప్ గెలవడానిక మేమిక్కడ ఉన్నాం. ఒత్తిడిని అధిగమించి రాణించే, విజయం పట్ల బలమైన సంకల్పం ఉ న్న జట్టును సిద్ధం చేయాలనుకుంటున్నాను" అని యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు.