28,445 కుటుంబాలకు ఇంటి హక్కు
రూ.8,874 కోట్ల విలువైన భూమికి పట్టాలు
హక్కు పత్రాలను అందించనున్న
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి: చారిత్రక ఘట్టానికి వేదికగా విశాఖ నిలవనుంది. రూ.8874 కోట్ల విలువైన భూమిపై లబ్దిదారులకు హక్కులను ప్రభుత్వం కల్పించనుంది. లబ్దిదారులకు నేడు సీఎం చంద్రబాబు నాయుడు పట్టాలు పంపిణీ చేయను న్నారు. దశాబ్దాలుగా పెండింగులో ఉ న్న సమస్యను పరిష్కరిస్తూ 28, 445 కుటుంబాలకు ఇంటి హక్కు పత్రాలను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు అందించనున్నారు. విశాఖలో ఇంత పెద్ద ఎత్తున క్రమబద్దీకరిస్తుఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. పేదల సొంతింటి కలకు హక్కును కల్పిస్తూ మొత్తంగా 11 మండలాల్లో 899 ఎకరాల భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసింది. 999 ఎకరాల పరిధిలోని 19,38,858 చదరపు గజాల రెగ్యులరైజేషన్ ఇప్పటి వరకు జరిగింది. తమ ఇళ్లపై హక్కుల కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న లబ్దిదారుల కలలను సాకారం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంట్లో ఉంటున్నా హక్కు లేని కుటుంబాలకు ఇక సంపూర్ణ హక్కులతో పాటు క్రమబద్ధీకరణతో భరోసా లభించనుంది. దీంతో లబ్దిదారుల దశాబ్దాల నిరీక్షణకు కూటమి ప్రభుత్వం తెర వేసింది. వివిధ సమీక్షలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అభ్యంతరాల్లేని చోట్ల క్రమబద్ధీకరణ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మండలాల వారీగా లబ్దిదారుల వివరాలు...
విశాఖ రూరల్ లో అత్యధికంగా 9261 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ములగాడలో 4,218 కుటుంబాలకు, గాజువారలో 4353 కుటుంబాలకు వట్టాలు అందనున్నా యి.గోపాలపట్నంలో 1258 కుటుంబాలకు పెందుర్తిలో 2722 కుటు బాలకు లబ్ది చేకూరనుంది. పెదగంట్యాడలో 1910, మహారాణిపేటలో 1205 కుటుంబాలకు హక్కులు లభించనున్నాయి. సీతమ్మధారలో 608, భీమిలి లో 464 కుటుంబాలకు, ఆనందపురంలో 340 వద్మనాభం 17 కాథం 17 కుటుంబాలకు హక్కులను ప్రభుత్వం కల్పించనుంది.