తప్పు ఒప్పుకొని అప్రూవర్ గా మారు!
మీరు ఇక సీఈసీగా ఉండలేరు మీరు చేసిన తప్పుల
వెనుక మాస్టర్‌మైండ్ వేరే ఉన్నారని తెలుసు
మా ఉద్యమం శివతాండవం.. నెలలు, ఏళ్లయినా కొనసాగిస్తాం
ప్రస్తుత పోరాటాలన్నింటి లక్ష్యం దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే
మోదీ సర్కారులోని 200 మంది అధికారులు మాతో టచ్ లో ఉన్నారు
మీడియా సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
కాన్స్టిట్యూషన్ క్లబ్ నుంచి సుప్రీంకోర్టు దాకా విపక్షాల ర్యాలీ
న్యూఢిల్లీ : తన వదవికి వెంటనే రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారిపోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిష సర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు. జానేశ్కు మార్ తన పదవికి రాజీనామా చేసేవరకూ తమ ఉద్యమం కొనసాగిస్తామని.. అది నెల లైనా, ఏళ్లయినా వెనక్కు తగ్గేదే లేదని స్పష్టంచే శారు. తప్పు చేశానన్న భావనతో సీఈసీకి రాత్రి పూట నిద్రకూడా పట్టడం లేదని అన్నారు. జ్ఞానేశ్ కుమార్ తనకు సందేశాలు పంపుతున్నా రని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 'జ్ఞానేశు మా ర్ నుంచి నాకు సందేశాలు వస్తున్నాయి. ఆయ నకు నేను స్పష్టంగా చెప్తున్నా.. మీరు వెంటనే సీఈసీ పదవికి రాజీనామా చేసి, అప్రావర్‌గా మారిపోండి. మీరు ఇక ఎంతమాత్రమూఆ పదవిలో కొనసాగలేరు. మీరు తప్పులు చేశారు.. కానీ, వాటి వెనుక మాస్టర్ మైండ్ మీరు కాదని మాకు తెలుసు. రాజీనామా చేస్తే మిమ్మల్ని క్షమిస్తాం. మీపై ఉన్న ఒత్తిడిని అర్ధం చేసుకుంటాం. మాకు మీ గురించి సమాచారం ఉంది. మీ గతం మాకు తెలుసు. మీ అవినీతి గురించి మాకు తెలుసు. మేము వేచి చూస్తున్నాం' అని రాహుల్ గాంధీ అన్నారు. దాదావు 200 మంది ప్రభుత్వోద్యో గులు, ఈడీ, సీబీఐ, విదేశాంగ శాఖల అధికారులు తమకు సమాచారం ఇస్తున్నారని చెప్పారు.
ఈ ఉద్యమం శివతాండవం..
దేశాన్ని కాపాడేందుకు ఎన్నిరోజులైనా ఉద్యమం కొనసాగిస్తామని రాహుల్‌గాంధీ అన్నారు. 'మా పోరాటం శివతాండవం... శివుడి పెళ్లి బారాత్... ఈ బారాత్లోకి ఎవరైనా వచ్చి చేరొచ్చు.. దేశప్రజలంద రికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనే పరిస్థితి లేకుంటే.. మీరు ఉన్నచోటి నుంచే మాకు మద్దతు తెలపండి. ఈ ఉద్యమం రాహుల్ గాంధీ కోసమో.. మోదీ కోసమో కాదు.. దేశాన్ని కాపాడటానికి... రాజ్యాంగాన్ని కాపాడటానికి.. ఈ పని ఒకటి రెండు రోజుల్లో అయ్యేది కాదు. నెలలు, సంవత్సరాలైనా పట్టొచ్చు. ఇందులో విజయం సాధిం చేవరకు పోరాడుతూనే ఉంటాం' అని స్పష్టంచే శారు. 'మోదీకే కాదు.. ఈ దేశం ఎవరికీ భయవ డదు. ఇప్పుడు ఎవరు, ఏ రూపంలో పోరాటం చేస్తున్నా.. వాటన్నింటి లక్ష్యం ఒక్కటే.. ఈ దేశాన్ని కాపాడటమే. రాజ్యాంగ ఔన్నత్యాన్ని తిరిగి నిలబెట్టే వరకు.. సీఈసీ దిగిపోయేవరకు.. ఎన్నికల వ్యవస్థను సంస్కరించేవరకు ఈ దేశ యువత పోరాటాన్ని ఆవరు' అని రాహుల్ అన్నారు.
సీజేఐ రాజీనామా చేయాలి: కేరళ పీసీసీ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ సూర్యకాంత్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ కేరళ విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమ వారం ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఎన్ఐఐఆర్కు వ్యతిరే కంగా జరుగుతున్న నిరసనలపై ఇటీవల సీజేఐ స్పందిస్తూ.. శాంతిభద్రతల అంశం తన పరిధిలోనిది కాదని అన్నారు. ఈ ప్రకటనపై కాంగ్రెస్ మండిప డింది. ప్రియమైన సూర్యకాంత్- శాంతిభద్రతల అంశం మీ పరిధిలోనిది కాకపోతే వెంటనే రాజీనామా చేయండి. శాంతిభద్రతలు కాపాడే మరో వ్యక్తితో ఆ పోస్టును భర్తీ చేస్తాం' అని పేర్కొంది. ఈ ప్రకటనపై వీజేపీ మండిపడింది. సీజేఐని కాంగ్రెస్ బెదిరిస్తోంది. రాజ్యాంగంకంటే గాంధీ వాద్రా పరివార్ ఉన్నతమైన దని భావిస్తోంది' అని బీజేపీ నేత ప్రదీప్ భండారీ ఆరోపించారు. విమర్శలు తీవ్రం కావటంతో తన పోస్టును కేరళ పీసీసీ తొలగించింది.
సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీ
సీఈసీ, ఎన్ఐఐఆర్కు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు సోమ వారం కాన్స్టిట్యూషన్ క్లబ్ నుంచి సుప్రీంకోర్టు వరకు వేలాది మందితో ర్యాతీ నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రియాంకగాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్, టీఎంసీ (మమత) అధి నేత్రి మమతా వెనర్జీ, సీపీఐ నేత డీ రాజా, సీపీఎం నేత ఎంపి జేబీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ(ఎస్సీ) నేత సుప్రియా నూలే, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, సీపీఐఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య, ఐఏయూఎంఎల్ నేత ఈటీ మహమ్మద్ బషీర్, తెలంగాణ, కేరళ, కర్ణాటక సీఎంలు రేవంత్‌రెడ్డి, సతీశన్, డీకే శివకుమార్ తదిత రులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నేహా బోరా వంటి అనేక మంది యువ నిరసనకారులు. యోగేంద్ర యాదవ్ వంటి సామాజిక కార్యకర్తలు కూడా ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ ర్యాలీని భగవాన్‌దాస్ రోడ్లో పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఆగకుండా నిరసనకారులు ముందుకు వెళ్లారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ప్రతివక్ష నేతలు.. ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టులో పిటిషన్ సమర్పించారు.