మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ దేశద్రోహులు: రాహుల్
దేశద్రోహులకు శిక్ష ఖాయమని హెచ్చరిక
అప్రూవర్‌గా మారాలని జ్ఞానేశ్ కుమారుకు సూచన
సీఈసీ పై అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధం!
48 గంటల్లోగా జ్ఞానేశ్ రాజీనామా చేయాలి : సీజేపీ
ప్రజాస్వామ్యానికి పెనుముప్పు: అభిజీత్ దీప్కే
ఆయన రాజీనామా చేయకపోతే జంతర్ మంతర్ 2.0 తప్పదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ : ఓటరు జాబితా ప్రత్యేక నమగ్ర నవరణ (ఎస్ఐఆర్)పై ఎన్ని కల కమిషనర్లే అభ్యంతరం వ్యక్తం చేశారంటూ 'ఇండి యన్ ఎక్స్‌ప్రెస్' లో వచ్చిన వార్తాకథనం నేపథ్యంలో... ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్ని కల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారు దేశంలో ఓట్ల వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావే శంలో మాట్లాడిన రాహుల్.. సీఈసీ జానేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విష యంలో అప్రూవర్‌గా మారిపోవాలని సీఈసీకి సూచిం చారు. ఆయన చేసింది దేశ వ్యతిరేక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అన్ని ఎన్నికలూ రిగ్ అవుతున్నాయని.. 2024 సార్వత్రిక ఎన్ని కలు పూర్తిగా బూటకమని మండిపడ్డారు. దేశానికి చేసిన నష్టానికిగాను మోడీ, షాలపై దర్యాప్తు జరుగుతుందని.. ప్రజాస్వామ్యం నాశనమవుతుంటే తాము మౌనంగా చూస్తూ కూర్చోబోమని, బాధ్యు లను శిక్షిస్తామని హెచ్చరించారు. దేశ ప్రజాస్వామిక వ్యవస్థలను నాశనం చేసే వ్యక్తులు దేశద్రోహులేనని దుయ్యబట్టారు. "గుర్తు పెట్టుకోండి. దేశ ద్రోహులకు కచ్చితంగా శిక్ష పడుతుంది"
అని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో రాహుల్.. కుట్రదారులు', 'పావులు అనే పేర్లతో కొందరి ఫొటోలను తెరపై ప్రదర్శించారు. కుట్రదారులు అనే శీర్షిక కింద మోదీ, అమిత్ షా, గౌతమ్ అదానీ, ఆరెస్సెస్ చీప్ మోహన్ భాగవత్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోబాల్, ప్రధాని పీఎస్ పీకే మిశ్రా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చిత్రాలను ఉంచారు. వారు చెప్పినటల్లా ఆడుతున్నారనే అర్థం వచ్చేలా.. 'పావులు (పాన్స్)లి అనే శీర్షిక కింద కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామ న్. పీయూష్ గోయల్, విద్యాశాఖ మాజీ మంత్రి దర్శేంద్ర పథ్రాన్, ప్రముఖ పాత్రికేయుడు అర్థబ్ గోస్వామి. యోగా గురు రాందేవ్ బాబా తదితరుల ఫొటోలను ప్రదర్శించారు. బీజేపీ మరో 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని అమిత్ షా, 'ఈసారి 400 సీట్లు' అని మోదీ అంటున్న వీడియోలను కూడా చూపిన రాహుల్.. ప్రజాస్వామిక వాతావరణంలో పనిచేసే ఏ రాజకీయ నాయకుడూ అలాంటి వ్యాఖ్యలు చేయరని విమర్శించారు. భారతదేశంలో.. ప్రజా వ్యతిరేకత అనే సహజమైన ప్రజాచైతన్యం ఉంటుందని, అది ఎవరినీ వదిలిపెట్టదని గుర్తుచే శారు. తానొక రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని, ప్రభుత్వ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎలా ఉ ంటుందో తనకు తెలుసునని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా ఇంది రాగాంధీ ఒకటిరెండేళ్లలోనే పెద్ద ఎత్తున ప్రజా వ్యతి రేకత ఎదుర్కొన్నారని ఆయన ఉదహరించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజా వ్యతిరేక తను ఎదుర్కొన్నాయని.. కానీ నరేంద్రమోదీ, అమిత్ షా మాత్రం ప్రజావ్యతిరేకతను ఎందుకు ఎదుర్కొనడం లేదనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మనంద రికీ తెలుసని వ్యంగ్యంగా అన్నారు. "ప్రజా వ్యతిరేకత పూర్తిగా కనిపించకపోవడమా? ఇది నద్దాంహుస్సేన్ పాలనలోని ఇరాక్‌లో ఉత్తర కొరియా వంటి చోట్ల మాత్రమే జరుగుతుంది' అని వ్యాఖ్యానించారు. ఓటే మన ప్రజాస్వామ్యానికి వునాది అని.. ఎన్ని కల కమిషన్ సంరక్షించే ఓటు రాజ్యాంగాన్ని కాపాడు తుందని రాహుల్ పేర్కొన్నారు. "అంతటి కీలకమైన ఓటే ధ్వంసమైపోతే రాజ్యాంగం కూడా నాశనమైనట్టే. దానికి ఎలాంటి శక్తి ఉ ండదు. రాజ్యాంగం ధ్వంస మైతే.. చట్టాలు అక్రమంగా, వ్యవస్థలు అర్థరహితంగా మారుతాయి" అని ఆందోళన వెలిబుచ్చారు. ఓటు. చోరీ వల్ల చట్టాల చోరీ, వ్యవసల చోరీ జరుగుతుం దని వ్యాఖ్యానించారు. దేశంలో ఓటు చోరీ కుట్రకు తెరతీసినవారెవరో దేశానికి తెలునన్నారు. ఓట్ల చోరీ తర్వాత చేసిన చట్టాలన్నీ చెల్లనివేనన్నారు.
మూడోసారి..
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై అభిశంనన తీర్మానం ప్రవేశపెట్టి తొలగించేందుకు లోక్ సభ, రాజ్యసభల్లో వచ్చేవారం నోటీనులు సమర్పించాలని ప్రతివకాలు భావిస్తున్నాయి. దీనితో ప్రతివక్షాలు మూడోసారి. సీఈసీ తొలగింపునకు నోటీసు ఇచ్చినట్లవుతుంది. ఇందుకోసం ఇండియా కూటమి పార్టీలన్నీ మరో సారి సమావేశం కానున్నాయి. జ్ఞానేశ్ కుమార్ తొల గింపునకు 73 మంది విపక్ష ఎంపీలు ఈ ఏడాది ఏప్రిల్ 24న ఇచ్చిన నోటీసు ప్రస్తుతం రాజ్యనభలో పెండింగ్‌లో ఉంది.
29న సీడబ్ల్యూసీ భేటీ
దేశవ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ
ఓటు చోరీ, నర్ ప్రక్రియకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉ ద్యమానికి కార్యాచరణ ప్రణాళిక రచిం చేందుకు ఈ నెల 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి... పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ గురువారం ఏఐ సీసీ రాష్ట్ర ఇన్చారులు, రాష్ట్రాల పార్టీ అధ్యక్షు లతో వర్చువల్ సమావేశం నిర్వహించినట్లు తెలి పాయి. అలాగే.. 25న అన్ని రాష్ట్రాల్లో ఈసీ కార్యా లయాల వద్ద నిరసన ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్రాల పార్టీ శాఖలను కోరినట్లు కేసీ వేణుగో పాల్ 'ఎక్స్'లో తెలిపారు 28న కలెక్టరేట్ల వద్ద నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
మళ్లీ ఆందోళనకు దిగుతాం..
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు) అభిజిత్ దీప్కే కూడా సీఈసీ జ్ఞానశకుమార్ను అతి పెద్ద దేశద్రోహిగా, ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా అభివర్ణించారు, ఆయన మరో 48 గంటల్లోగా రాజీనామా చేయకపోతే తాము దేశ వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని.. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరిం చారు. "మా ఓటు హక్కును రద్దుచేయడానికి జ్ఞానేశ్ ఎవరు?" అని ప్రశ్నించి.. ఆయనపై క్రిమిన ల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జానేశ్ రాజీనామా చేయకపోతే 'జంతర్ మంతర్ 2.0' కచ్చి తంగా జరిగి తీరుతుం ధని దీప్కే స్పష్టం ఇక.. దేశం చేశారు. లోని జెన్ జీ తమకు ఖీ మద్దతుగా లేదని భావి స్తున్నందునే అధికార పార్టీ యువ ఓటర్ల పేర్లను ఓటరు జాబితాలోంచి తీసేసే చర్యలు తీసుకుంటోందని సీజేపీ కో-కన్వీ నర్ సౌరవ్ దాస్ ఆరోపించారు.