'37' తర్వాత మరో క్రిప్టిక్ టీజర్!
అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'రాకా'పై ఆసక్తి మరింత పెరుగుతోంది. సినిమా కథ, పాత్రలకు సంబంధించిన వివరాలను మేకర్స్ ఇప్పటికీ రహస్యంగానే ఉంచుతున్నారు. తాజాగా మరో క్రిప్టిక్ టీజర్‌ను విడుదల చేయడంతో అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. సన్ పిక్చర్స్ విడుదల చేసిన ఈ వీడియోలో.. "అసాధ్యంగా అనిపించిన దానిని దాటి.. ఊహించడానికి ధైర్యం చేశాం. దాన్ని ఆర్కైవ్ చేయడానికి ధైర్యం చేశాం. రాకా: ఏ గ్లోబల్ ట్రయంఫ్" అంటూ. క్యాప్షన్ ఇచ్చారు. అయితే 'గ్లోబల్ ట్రయంఫ్' అంటే ఏంటి? సినిమాకు సంబంధించిన ఏ అంశాన్ని ఇది సూచిస్తోంది? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఒకరోజు ముందు మేకర్స్ విడుదల చేసిన 37' అనే సంకేతం కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు 'గ్లోబల్ 'ట్రయంఫ్' అనే మరో క్లూతో అసలు కథేంటన్న ఆసక్తిని మరింత 'పెంచారు. 'రాకా' రెండు కాలాల్లో సాగే కథగా తెలుస్తోంది. ఆధునిక కాలానికి సంబంధించిన కథలో మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పురాణ వైదిక కాలానికి సంబంధించిన భాగంలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, రష్మిక మందన్న నటిస్తున్నట్లు సమాచారం. దీపిక ఓ గర్భిణి పాత్రలో కనిపించనున్నట్లు గతంలో కథనాలు వచ్చాయి. రష్మిక ఆమెకు మార్గదర్శిగా, రక్షకురాలిగా కనిపిస్తారని సమాచారం. జాన్వీ గిరిజన రాణి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌కు తొలి సినిమా. షారుక్ ఖాన్ కూడా అంతర్జాతీయ షెడ్యూల్లో కీలక అతిథి పాత్ర కోసం షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. అయితే '37'కు 'గ్లోబల్ ట్రయంఫ్'కు ఉన్న సంబంధం ఏంటన్నది మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.