ఎండీఎల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ
రూ. 15,000 కోట్లు పెట్టుబడి.. 45 వేల మందికి ఉపాధి అవకాశాలు
ఏడాదికి 12 లక్షల టన్నుల భారీ నౌకల నిర్మాణ సామర్థ్యంతో షిప్ యార్డు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ప్రముఖ షిప్ బిల్డింగ్, మెరైన్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ అభివృద్ధి చేసే దిశగా మరో కీలక ముంద డుగు వడింది. దుగ్గరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటు కు మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. శుక్ర వారం ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు సమక్షంలో సచివాల యంలో ఎండీఎల్, నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్-ఏపీ (ఎస్ ఎస్ హెచ్ ఐపీ ఏపీ) మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది. దుగ్గ రాజపట్నంలో ఆధునిక గ్రీస్ఫేల్డ్ షిప్ యార్డ్ నిర్మాణం కోసం వచ్చే 5 ఏళ్లలో ఎండీఎల్ సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడి పె ట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. షిల్బిల్డింగ్తో పాటు అనుబంధ పరిశ్రమలు, మెరైన్ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసెస్ తదితర రంగాల్లో పెద్దఎత్తున ఉపాధి, పెట్టుబడులు వస్తాయి. ఏడాదికి 12 లక్షల టన్నుల సామర్ధం... ప్రతిపాదిత షిప్ యార్డ్ ఏటా 12 లక్షల గ్రాస్ టన్నుల (1.2 మిలియన్ జీటీ) నౌకల నిర్మాణ సామర్థంతో రూపుదిద్దుకోనుంది. భవిష్యత్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సామర్ధ్యాన్నిమరింత విస్తరించేందుకు కూడా వీలుంది. ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు, కంటైనర్ నౌకలు, ఎల్ఎసీ క్యారియర్లు, ఇతర భారీ ప్రత్యేక నౌకలను నిర్మించేలా ఈ షిప్ యార్డ్‌ను అభివృద్ధి చేయనున్నారు. నరు, దీని ద్వారా దేశీయ అవసరాలతో దేశీయ అవసరాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా నౌకలనునిర్మించే సామర్థం రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది.
దుగరాజపట్నంలో సమగ్ర షిప్ బిల్డింగ్ క్లస్టర్
దుగ్గ రాజపట్నంలో షిప్‌బిల్డింగ్-కమ్- పోర్ట్ క్లస్టర్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుంది. టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (టీ ఈ ఎఫ్ ఆర్) ప్రకారం షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ యార్కు సుమారు రూ.29,251 కో కోట్లు, పోర్టు అభివృద్ధికి సుమారు రూ.9,513 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుండగా, షిప్ బిల్డింగ్ క్లస్టర్‌ను కేంద్ర ప్రభుత్వ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీం (ఎస్ బీడీఎస్) కింద అభివృద్ధి చేయనున్నారు. ఈ క్షచర్కు ఎండీఏల్నుయాంకర్ షివ్వర్డ్ ఎంపిక చేశారు.
దేశ షిప్ బిల్డింగ్ లక్ష్యాలకు అనుగుణంగా..
భారతన్ను 2047 నాటికి ప్రపంచంలోని ఆగ్రశ్రేణి షిప్ బిల్డింగ్ దేశాల్లో ఒకటిగా నిలబెట్టాలన్న జాతీయ లక్ష్యానికీ దుగరాజపట్నం ప్రాజెక్టు దోహదపడ నుండి. మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047, కేంద్ర ప్రభుత్వ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీం లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ మారి టైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎండీఎల్ సీఎండీ జగ్మోహన్, విశాఖపట్నం పోర్ట్ ఆథారిటీ చైర్ పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.