అమెరికాలో పెర్మ్ సస్పెన్షన్... ఐటీ దిగ్గజాలకు భారీ షాక్
భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
న్యూఢిల్లీ : అమెరికాలో ఐటీ రంగంలో పనిచేస్తూ శాశ్వత నివాస హోదా పొందాలని ఆశపడుతున్న వేలాది మంది భారతీయ నిపుణులకు అమెరికా ప్రభుత్వం తీరని గుండెకోత మిగిల్చింది. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు, వేతన భద్రతను పరిరక్షించడమే ధ్యేయంగా వైట్ హౌస్ వేదికగా జరిగిన అత్యున్నత సమావేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సంచలన నిర్ణయం ప్రకటించింది. వైన్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలోని యాంటీ ఫ్రాడ్ టాస్క్ఫోర్స్ పర్యవేక్షణలో ఐటీ ఔట్ సోర్సింగ్ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, వి., హెచ్సీఎల్, కాగ్నిజెంట్, కాప్ జెమినిలతో పాటు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలపై పెర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ కార్యక్రమం నుంచి తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. ఇకపై ఈ సంస్థల నుంచి కొత్త పెర్న్ దరఖాస్తులు స్వీకరించబోమని, ప్రస్తుతం ప్రాసెసింగ్లో ఉన్న ఫైళ్లను కూడా తక్షణమే నిలిపివేస్తున్నామని తేల్చిచెప్పింది. అసలు అమెరికాలో విదేశీ ఉద్యోగికి జుదీ-2, జుదీ-3 కేటగిరీల కింద గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ ప్రారంభించాలంటే ఈ పెర్మ్ ప్రక్రియే అత్యంత కీలకమైన, చట్టబద్దమైన మొదటి మెట్టు. సదరు ఉద్యోగానికి అవసరమైన అర్హతలున్న అమెరికన్ పౌరులు ఎవరూ స్థానికంగా అందుబాటులో లేరని, విదేశీయుడిని నియమించడం వల్ల స్థానిక వర్కర్ల వేతనాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం వడటం లేదని కంపెనీలు సాక్ష్యాధారాలతో కార్మిక శాఖకు నిరూపించి సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. ఈ అనుమతి వచ్చిన తర్వాతే కంపెనీలు యూఎస్సీఐఎన్ వద్ద ఐ-140 పిటిషన్ దాఖలు చేసే అర్హత సాధిస్తాయి. ఇప్పుడు ఈ ప్రధాన రహదారినే అమెరికా మూసివేయడంతో నదరు దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల తరఫున గ్రీన్ కార్డ్ ప్రక్రియను ప్రారంభించే అర్హతను కోల్పోయాయి. గత కొన్నేళ్లుగా అమెరికా హెచ్-1బీ మరియు పెర్మ్ నిబంధనలను ఈ ఔట్సోర్సింగ్ కంపెనీలు పక్కదారి పట్టిస్తున్నాయని, లొసుగులను ఆసరాగా చేసుకుని విదేశీ నిపుణుల రిక్రూట్మెంట్లో తీవ్ర దుర్వినియోగానికి పాల్పడ్డాయని ఫెడరల్ దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. దాదాపు 30 లక్షల మంది విదేశీయుల కోసం దరఖాస్తులు చేసి, 2.3 లక్షలకు పైగా హెచ్-1బీ అనుమతులు, లక్షకు పైగా పెడ్జ్ సర్టిఫికేషన్లు పొందడం ద్వారా అమెరికన్ పౌరులకు చెండాల్సిన స్థానిక ఉద్యోగ అవకాశాలను దెబ్బతీశారని కార్మిక శాఖ మండిపడింది. తీవ్ర ఫెడరల్ విచారణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, స్థానిక కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.