అమరావతిలో 'ఫిలిం నగర్',
'ఎన్టీఆర్ స్టూడియోస్' ఏర్పాటు చేయాలి
స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పించేందుకు
ప్రత్యేక రోడ్ మ్యాప్ అవసరం ఏపీ ఎల్డీసీ చైర్మన్ భరత్ భూషణ్‌ను సత్కరించిన 'మా-ఏపీ'
విజయవాడ, : రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరించాలని 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ (మా-ఏపీ-–24 క్రాఫ్ట్స్ యూనియన్) అధ్యక్షుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా కోరారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎఫ్ఎసీ) నూతన చైర్మన్ పి. భరత్ భూషణ్‌ను 'మా-ఏపీ' ప్రతినిధులు శుక్రవారం నగరంలోని ఏపీ ఎఫ్ డీసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక రోడ్ మ్యాప్ రూపొందించాలని కోరారు. రాజధాని అమరావతిలో హైదరాబాద్ తరహాలో 'ఫిలిం నగర్', తెలుగు సినీ పరిశ్రమకు సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు పేరుతో 'ఎన్టీఆర్ స్టూడియోస్' ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అరకు, లంబసింగి, భవానీ ఐలాండ్, సూర్యలంక తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ల సు ప్రోత్సహించాలని, ఏపీలో కనీసం 20 శాతం చిత్రీకరణలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల పర్యాటక రంగంతో పాటు స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. రాష్ట్రంలోని నటీనటులు, కళాకారులతో సమగ్ర డైరెక్టర్ రూపొందించి నిర్మాతలు, దర్శకులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు, షూటింగ్‌లకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. కార్యక్రమంలో 'మా-ఏపీ' కార్యవర్గ సభ్యులు, నిర్మాతలు, సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.