పతకాల పట్టికలో టాప్-5లోకి భారత్
ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్లు స్వర్ణాల వేట కొనసాగిస్తున్నారు. ఆర్చరీ, బాక్సింగ్‌లో చారిత్రక విజయాలు నమోదు చేయడంతో భారత్ ఖాతాలో పసిడి పతకాల సంఖ్య 15కి చేరింది. తాజా విజయాలతో మొత్తం పతకాల సంఖ్య 75కు పెరిగింది. ఈరోజు జరిగిన మహిళల రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్ లో భారత్ సంచలనం సృష్టించింది. అంకితా భరత్, కీర్తి, కుంకుమ్ మోహోట్లతో కూడిన భారత జట్టు, ఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ ఛాంపియన్ అయిన బలమైన దక్షిణ కొరియాను ఓడించి చరిత్రలో తొలిసారి స్వర్ణ వతకాన్ని ముద్దాడింది. ఇదే క్రీడలో రికర్వ్ మిక్స్డ్ టీమ్, పురుషుల రికర్వ్ జట్లు రజత వతకాలు గెలుచుకున్నాయి.
బాక్సింగ్ లోనూ సత్తా చాటిన భారత క్రీడాకారులు
బాక్సింగ్‌లోనూ భారత క్రీడాకారులు నత్తా చాటారు. మహిళల 65 కేజీల విభాగంలో వర్వీన్ హుడా, 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ స్వర్ణ పతకాలు సాధించారు. ఒకే ఏషియన్ గేమ్స్ లో ఇద్దరు భారత మహిళా బాక్సర్లు స్వర్ణాలు గెలవడం ఇదే మొదటిసారి. మరోవైపు, రెజ్లింగ్‌లో సుజీత్ 65 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకోగా, పురుషు ల సెపక్తక్రా క్వాడ్రంట్ జట్టు కాంస్యం గెలుచుకుం ది. ప్రస్తుతం భారత్ 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 75 పతకాలతో వట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈరోజు సాయం త్రం జరగనున్న మహిళల హాకీ ఫైనల్లో స్వర్ణ పతకం కోసం భారత జట్టు చైనాతో తలపడనుంది.