బ్రిక్స్ అద్భుత దౌత్యవిజయం
అంతర్జాతీయ ఏకాభిప్రాయానికి నిదర్శనం
భారత్ పైనే ప్రపంచానికి ఉన్న నమ్మికకు ప్రతీక
సెమీకండక్టర్ రంగంలో ఎంతో పురోగతి
ప్రపంచ మార్కెట్లకు చేరుతున్న మన
సెమీకండక్టర్లు కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలి
సెమీకాన్ అభివృద్ధి ఇండియా 2026 ప్రారంభ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది చెందుతుంటే, మరోవైపు భారతదేశంపై ప్రపంచ విశ్వాసం కూడా పెరుగుతోంది అని మోడీ వ్యాఖ్యానించారు. భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన ఇటీవల ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సాధించిన దౌత్య విజయాన్ని గుర్తుచేసుకుంటూ.. న్యూఢిల్లీ ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించడం అంతర్జాతీయ ఏకాభిప్రాయానికి నిదర్శనమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక దౌత్య విజయం, దేశంపై ప్రపంచ నమాజానికి ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని ధృవీకరిస్తుందని ఆయన నొక్కిచెప్పారు. ఇది భారతదేశంపై ప్రపంచానికి ఉన్న నమ్మకానికి మరో ప్రధాన నిదర్శనమని మోడీ పేర్కొన్నారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన సెమీకాన్ ఇండియా-2026ను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించారు. సెప్టెంబర్ 19 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రపం చ సెమీకండక్టర్ రంగానికి చెందిన సంస్థలు, పరిశ్రమ ప్రతిని ధులు, నిపుణులు, స్టార్టప్‌లు, విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సెమీకాన్ ఇండియా ఐదో ఎడిషన్‌లో భారత్ సెమీకండక్టర్ రంగంలో సాధించిన పురోగతిని మోడీ వివరిం చారు. సెమికాన్ ఇండియా ప్రారంభోత్సవానికీ, విశ్వకర్మ దివస్ కు మధ్య బలమైన పోలికను చూపుతూ, ప్రధానమంత్రి దేశం శతాబ్దాల నాటి నిర్మాణ, సృజనాత్మక వారసత్వాన్ని గౌరవించారు. సాంప్రదాయ సృజనాత్మక శక్తి, 21వ శతాబ్దపు సాంకేతికత, దార్శనికతతో మేళవించడమనేది ఒక అద్భు తమైన యాదృచ్చికమని పేర్కొన్నారు. ఆత్మనిర్భర భారత్‌కు వికసీత్ భారత్ కు ఇదే మన స్పూర్తి అని మోడీ ఉద్ఘాటించారు. 2022లో జరిగిన తొలి ఎడిషన్‌లో విధానాలపై చర్చ జరిగితే, ఆ తర్వాత ప్రాజెక్టులు, పైలట్ లైన్లు, టెస్ట్ చిప్‌ల దశలకు భారత్ చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో తయారవుతున్న విప్‌లు భారత్‌లో పాటు ప్రపంచ మార్కెట్లలోని వినియోగ దారులకు చేరడం ప్రారంభమైందని చెప్పారు. మొహాలి. నూ రతి మరో రెండు ప్లాంట్లలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతోందని వెల్లడించారు. సెమీకండక్టర్ రంగంలో పరిశోధన, డిజైన్, తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్, సరఫరా వ్యవస్థలను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు. యువత, పరిశ్రమలు దేశంలో పరిశోధన, అభి వృద్ది కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భారత్‌ను సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రధాన తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గత 15 సంవత్సరాల్లో దేశం సాధించిన వేగవంతమైన పురోగతిని నొక్కిచెబుతూ, గ్లోబల్ ఫేన్టిక్ ఫెస్ట్ నమ్మిళిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు, 3,000 కిలోమీటర్ల ప్రత్యేక సరుకు రవాణా కారిడారీసు ప్రారంభిం చడం, 7.8 శాతం బలమైన త్రైమాసిక జీడీపీ వృద్ధి వంటి ప్రధా న మైలురాళ్లను ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశం యొక్క పెరుగుతున్న ఆర్ధిక విశ్వసనీయతకు నిదర్శనంగా, ఇటీవల జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ సార్ధ భౌమ రేటింగ్‌ను ఉన్నతి కరించడాన్ని కూడా ఆయన హైబైట్ చేశారు. ఈ కార్యక్రమా నికి గో2 దేశాల నుంచి 600కు పైగా సంస్థలు, ప్రతినిధులు హాజరపుతున్నారు. ఈ ఏడాది సెమీకాన్ ఇండియా థీమ్ సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఎకో సిస్టమ్‌లో ఉంది. సెమీకం డక్టర్ రంగంలోని మొత్తం. వాల్యూ కేసు ప్రజలకు పరిచు యం చేసేందుకు తాండ్ టూ సిలికాన్ లూ సిస్టమ్స్ పేరిట స్పెషల్ ఎక్స్పీరియన్స్ షోను ఏర్పాటుచేశారు.