గ్లామర్ డాల్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దిశా వటానీ భారతీయ చిత్రసీమలో పదేళ్ల జర్నీని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కథానాయకుడిగా రిలీజ్ అయిన -ఎం.ఎస్. ధోని: ది అన్స్టాల్ట్ స్టోరీ- చిత్రంతో బాలీవుడ్ లో సరికొత్త సంచలనం సృష్టించిన అందాల భామ దశాబ్ద కాలంగా హిందీ చిత్రాలకే పరిమితం కాలేదు. సౌత్ ఇండియాలోని భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లలో మెరుస్తూ తనకంటూ బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. చిత్ర పరిశ్రమలో తొలి అడుగుల నుంచే దిశా పటానీ తనలోని విభిన్న కోణాలను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. నిజానికి ఆమె నటిగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది టాలీవుడ్ చిత్రం -లోఫర్- తో. దర్శకుడు పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా సౌత్ ప్రేక్షకులకు పరిచయమైన అమ్మడు ఆ తర్వాత బాలీవుడ్లో -ఎం.ఎస్. ధోని- బయోపిత్తోతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. ఆ చిత్రంలో ప్రియాంకగా ఆమె నటన, అమాయకత్వంతో కూడిన నవ్వు ఉత్తరాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అటుపై బాలీవుడ్లో - బాఘీ 2, -భారత్-, -మలంగ్-, -ఏక్ విలన్ రిటర్న్స్--, -యోధ- వంటి వరుస చిత్రాలలో నటిస్తూ గ్లామర్ తో పాటు యాక్షన్ పాత్రలలోనూ తానెంత డిట్టో నిరూపించుకున్నారు. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా కఠినమైన స్టంట్ సీక్వెన్స్డ్ లలో సైతం నటించి యాక్షన్ క్వీన్ గా తన మార్కును చాటుకున్నారు. ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకుండా కథలో వైవిధ్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తన నటనను నిరంతరం పరిపూర్ణం చేసుకునే దిశగా అడుగులు వేశారు.