భారత ఫీల్డింగ్ ప్రమాణాలపై మాజీ కోచ్
ఆర్. శ్రీధర్ ఆందోళన 2026 టీ20ల్లో క్యాచింగ్
సామర్థ్యం 73.4 శాతంగా నమోదు
భారత ఆటగాళ్లు 58 క్యాచ్‌లు చేజార్చుకున్నట్లు
గణాంకాలు ఫీల్డింగ్ తప్పిదాలతో నికరంగా
97 పరుగుల నష్టం ఫీల్డింగ్ లో
బాధ్యత, క్రమశిక్షణ పెంచాలని శ్రీధర్ సూచన
టీ20 క్రికెట్లో భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు పడిపోతుండటంపై మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్, శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశాడు. జట్టులో ఫీల్డింగ్ విషయంలో సమూల మార్పులు రావాలని, ఆటగాళ్లలో బాధ్యత పెంచే సంస్కృతిని నిర్మించాలని సూచించాడు. కొత్తగా జట్టులోకి వస్తున్న ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో ఆశించిన స్థాయిలో సిద్ధంగా ఉండటం లేదని వ్యాఖ్యానించాడు. అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ పర్యటన నేపథ్యంలో ఆర్. శ్రీధర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
2026లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల గణాంకాల ప్రకారం... క్యాచింగ్ సామర్థ్యంలో తొలి పది జట్లలో భారత్ చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. భారత ఆటగాళ్లు 58 క్యాచ్‌లు వదిలేయగా, క్యాదింగ్ సామర్థ్యం 73.4 శాతంగా నమోదైంది. ఫీల్డింగ్ ద్వారా 129 వరుగులు ఆదా చేసినప్పటికీ, క్యాచ్‌లు వదిలేయడం, గ్రౌండ్ ఫీల్డింగ్‌లో తప్పిదాల కారణంగా 226 వరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా నికరంగా 97 వరుగుల నష్టం వాటిల్లింది. రనౌట్ అవకాశాలను చేజార్చుకోవడంలోనూ భారత్ అన్ని జట్ల కంటే ముందుంది. 19 అవకాశాలను వదిలేయగా, 14 రనౌట్లు మాత్రమే చేసింది. ఐదు స్టంపింగ్ అవకాశాల్లో రెండింటిని కూడా చేజార్చుకుంది. టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటికీ ఆ టోర్నీలోనూ భారత ఫీల్డింగ్ ఆశించిన స్థాయిలో లేదని శ్రీధర్ అన్నాడు. బ్యాటింగ్ బౌలింగ్‌లో స్పష్టమైన ప్రణాళికలు కనిపిస్తున్నా. ఫీల్డింగ్‌లో అలాంటి సంస్కృతి లోపించిందని అభిప్రాయపడ్డాడు. కొత్తగా వస్తున్న ఆటగాళ్లు బ్యాటింగ్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ తరానికి చెందిన ఆటగాళ్లతో పోలిస్తే ఫీల్డింగ్‌లో వెనుకబడుతున్నారని పేర్కొన్నాడు. ఈ నమన్యసు భారత జట్టు ఒక్కటే పరిష్కరించలేదని, దేశీయ క్రికెట్ వ్యవస్థ మొత్తం దీనిపై దృష్టి పెట్టాలని సూచించాడు. క్యాచ్‌లను అందుకోవడం, బంతిని వేగంగా చేరుకోవడం, బౌండర్ మంచి విసిరే త్రోల వేగం, రనౌట్లు సాధించే సామర్థ్యం వంటి అంశాలను గణాంకాలతో నిరంతరం పర్యవేక్షించాలని చెప్పాడు. ఆటగాళ్లకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించి, ప్రతి మ్యాచ్‌లో వారి ప్రదర్శనను సమీక్షించాలని సూచించాడు. న్యూజిలాండ్‌లో చల్లని వాతావరణం, వెల్లింగ్టన్లో బలమైన గాలులు, క్రైస్ట్చర్స్లో తక్కువ ఉష్ణోగ్రతలు భారత ఆటగాళ్లకు నవాలుగా మారవచ్చని శ్రీధర్ అన్నాడు. అక్కడి వరిస్థితులకు త్వరగా అలవాటు పడాల్సిన అవసరం ఉందని చెప్పాడు. 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఫీల్డింగ్ పైనా శ్రీధర్ ప్రత్యేకంగా స్పందించాడు. అతడి కోసం ప్రత్యేక శిక్షణ ప్రణాళిక రూపొందించి, రోజూ ఫీల్డింగ్ సాధన చేయించాలని సూచించాడు. భవిష్యత్తులో అతడు అత్యుత్తమ ఫీల్డర్‌గా ఎదగాలంటే ఇప్పటి నుంచే క్రమశిక్షణతో శిక్షణ పొందాలని అభిప్రాయపడ్డాడు.