గడువులోగా ప్రత్యేక సమగ్ర సవరణ
ప్రక్రియ పూర్తి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు,
నోటీసుల విచారణను అక్టోబర్ 5లోపు పూర్తి చేయాలి
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.లక్ష్మీశ
విజయవాడ, : భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పురోగతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నోటీసుల జారీ, నోటీసులపై విచారణ, ఓటరు కార్డుల ఫోటోలను అప్డేట్ చేయడం, ఫారం--6, ఫారం--7, ఫారం--8 దరఖాస్తుల విచారణ స్థితి, బూత్ లెవల్ అధికారులతో ఫోన్ కాల్స్ తదితర అంశాలపై పురోగతిని సమీక్షించారు. జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా మొత్తం 1,94,681 మందికి నోటీసులు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ డా.జి. లక్ష్మీశ తెలిపారు. వీరిలో ఇప్పటివరకు 1,87,335 మందికి విచారణ పూర్తి చేయగా, ఇంకా 7,346 మందికి విచారణ నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న విచారణలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రత్యేక నమగ్ర నవరణ ప్రక్రియలోని 'ఇతరుల' కేటగిరీలో మొత్తం 13,95,044 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వీరిలో తుది ఓటర్ల జాబితా కోసం 13,15,882 మందిని పార్క్ చేయడం జరిగిందని, ఇంకా 79,162 మంది పెండింగ్లో ఉన్నారని వివరించారు. పెండింగ్లో ఉన్న ప్రక్రియను కూడా నిర్ణీత కాలపరిమితిలో వూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఓటరు కార్డుల ఫోటోలను అప్డేట్ చేసే ప్రక్రియలో జిల్లాలో మొత్తం 6,51,452 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు బూత్ లెవల్ అధికారులు 5,13,116 మంది ఓటర్ల ఫోటోలను అప్డేట్ చేశారని చెప్పారు. దీూరాలు అప్డేట్ చేసిన ఫోటోలలో 3,93,728 మందికి సంబంధించిన వివరాలను ఇఆర్ఓలు ఆమోదించడం జరిగిందని తెలిపారు. మిగిలిన ఫోటో అప్డేట్, ఆమోద ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల సమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులకు సంబంధించి పచ్చిన దరఖాస్తులపై కూడా సమావేశంలో సమీక్ష జరిగింది. ప్రస్తుతం జిల్లాలో ఫారం 6 దరఖాస్తులు 6,281, ఫారం-7 దరఖాస్తులు- 1,169, ఫారం-8 దరఖాస్తులు-- 4,862 పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. పెండింగ్లో ఉన్న ఈ దరఖాస్తులన్నింటిపై అక్టోబర్ 5వ తేదీలోపు విచారణ ప్రక్రియను పూర్తి చేసి, ఎన్నికల నిబంధనల ప్రకారం అర్హత కలిగిన దరఖాస్తులను తుది ఓటర్ల జాబితాలో ప్రచురించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫారం-6, ఫారం--8 దరఖాస్తులకు సంబంధించి అధిక సంఖ్యలో తిరస్కరణలు నమోదైన నియోజకవర్గాల వివరాలను కూడా సమావేశంలో సమీక్షించినట్లు కలెక్టర్ తెలిపారు. తిరస్కరణకు దారితీసిన కారణాలు, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ తదితర అంశాలను నిబంధనల మేరకు వరిశీలిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఓటర్లు తమ పరిధిలోని బూత్ లెవల్ అధికారులతో నేరుగా మాట్లాడేందుకు అందుబాటులో ఉ న్న 'బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో' 'సేపకు సంబంధించి కూడా పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం 15 ఫిర్యాదులు 48 గంటల వ్యవధిలోపు పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వాటిని నిర్దేశిత గదుపులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా పెండింగ్లో ఉన్న నోటీసుల విచారణ, దరఖాస్తుల పరిశీలన, ఫోటో అప్డేట్, బిఎల్-ఇఆర్ స్థాయి ప్రక్రియలు తదితర అంశాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ డా.జి. లక్ష్మీశ తెలిపారు. అక్టోబర్ 6వ తేదీని విచారణ ప్రక్రియకు తుది గడువుగా పాటిస్తూ, నిబంధనల ప్రకారం అన్ని ప్రక్రియలను పూర్తి చేసి, అక్టోబర్ 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర నవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం, నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేందుకు అధికారులు నమస్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.