రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అక్టోబర్ 23 అంటే కేవలం ఆయన పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు.. అదొక పెద్ద పండుగ రోజు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పిరియాడిక్ డ్రామా 'ఫౌజీ' చిత్ర మేకర్స్ ఒక స్పెషల్ గ్లింప్సు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వస్తున్న ఈ బర్త్‌డే అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా పెద్ద హీరోల పుట్టినరోజు వస్తే టీజర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించడం సహజం. అయితే 'ఫౌజీ' మూవీ విషయంలో నిర్మాతలు ఒక డిఫరెంట్ ప్లాన్‌తో ముందుకు వస్తున్నారు. అక్టోబర్ 23న సాధారణమైన టీజర్ రావడం లేదని, అంతకుమించి ఒక సరికొత్త ఫార్మాట్లో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో కూడిన విజువల్స్ ప్లాన్ చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధినేత సవీన్ ఎర్నేని స్పష్టం చేశారు. ఈ స్యూస్ సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. హసు రాఘపపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాలోని ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతోందనేది చిత్ర యూనిట్ గోప్యంగా ఉంచింది. దీంతో అక్టోబర్ 23న వచ్చే ఈ స్పెషల్ గ్లింప్స్ ప్రభాస్ ఏ అవతారంలో కనిపిస్తారు? సినిమా నేపథ్యం ఏంటి? అనేది చూడటానికి డార్లింగ్ అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. ఇక ఆ విజువల్ సర్ ప్రైజ్ కోసం నెట్టింట భారీ చర్చ సాగుతోంది. రొటీన్ ప్రమోషనల్ వీడియోలా కాకుండా సినిమాలోని గ్రాండియర్ న్ను, కథలోని ప్రాధాన్యతను ప్రతిబింబించేలా ఈ బర్త్‌డే అప్డేట్ ఉండబోతోందని సమాచారం. టీజర్ కు భిన్నంగా వినూత్న శైలిలో సినిమా ప్రచారాన్ని నిర్వహించాలనే మేకర్స్ ఆలోచన.. ఈ చిత్రంపై వారికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. ఇక అయితే పూర్తి టీజర్‌నే విడుదల చేయాలని సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు మేకర్‌ను వరుస పోస్టులతో అభ్యర్థిస్తున్నారు.