భూగర్భ డ్రైనేజీ,
అండర్ గ్రౌండ్ గ్యాస్
కనెక్షన్ కూడా పూర్తి
వచ్చే ఏడాది వంద పడకల ఆసుపత్రి ప్రారంభిస్తాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి
మూడో విడత పట్టాల
పంపిణీలో మంత్రి నారా లోకేష్
మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో
372మందికి శాశ్వత పట్టాలు
అమరావతి, : మంగళగిరిలో 2029 ఎన్నికల లోపు ప్రతి గడపకి తాగునీటి కనెక్షన్, అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజి పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటా, ఆనాడు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నానని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లి మండలం కుంచనపల్లి లో మన ఇల్లు- మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేష్ చేతుల మీదుగా 372 మందికి శాశ్వత పట్టాలు, పీఎంఏవై మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి ఇక్కడ ప్రజల దశాబ్దాల కల. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పురూ ఊహించని రీతిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఆసుపత్రి నిర్మాణానికి కారం చుట్టాం. వచ్చే సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసే బాధ్యత తాము తీసుకుంటామని అన్నారు. మహానాడు కట్టకి రిటైనింగ్ వాల్, భూగర్భ డ్రైనేజ్, తాగునీటి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలని ఎన్నికల సమయంలో అడిగారు. వాటిని ప్రణాళికా బద్ధంగా చేపట్టి, పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
అత్యధిక మెజారిటీ నా బాధ్యత పెంచింది...
తాను మంగళగిరిలో పుట్టకపోయినా 2019లో మంగళగిరి నా సొంత ఊరుగా భావించి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయా, వ్ర జలను అర్ధం చేసుకునేలోపే ఎన్నికలు అయిపోయాయి, 5000 ఓట్ల తేడాతో పరాజయం చెందానని, ఆ ఓటమి నాలో కసి పెంచిందని మంత్రి లోకేష్ అన్నారు. ఐదేళ్లపాటు కష్టపడి మీ మనసు గెలుచుకొని ఇక్కడనుంచే శాససనభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకు న్నానని తెలిపారు. తరువాత ఎన్నికల్లో తనను ఎంత ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే అంతబలం వస్తుంది. చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెస్తానని ఆనాడు హామీ ఇచ్చా. మీ ఆశీస్సులతో ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే టాప్-3 మెజారిటీతో విజయం సాధించా, 58 వేల మెజారిటీ అడిగితే, 92 వేల ఓట్ల ఆధిక్యతతో ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారని మంత్రి లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మెజార్టీ తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు.
రూ.2వేల కోట్ల ఆస్తి పంపిణీ...
2019 ఎన్నికల సమయంలో అనేకమంది నాయకులు మంగళగిరి ప్రజల ఇంటిపట్టాల సమస్యపై హామీ ఇవ్వాలని తనకు సూచించారని, అయితే ఆనాడు సమస్య అర్థం కాకపోవడంతో తాను హామీ ఇవ్వలేక వే "పోయానని మంత్రి లోకేష్ తెలిపారు. గత ఎన్నికల్లో గడపగడపకు వచ్చినపుడు దశాబ్దాలుగా ఇక్కడే జీవిస్తున్న వారితో మాట్లాడాక నమస్య అర్థమైందన్నారు. సొంత ఇల్లు ఒక ఎమోషన్, కుటు ంబమంతా చెమటోడ్చి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు ఆ ఇల్లు మీది కాదు, రేవు మాపో ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ప్రతిక్షణం భయపెట్టే పరిస్థితి ఆనాడు ఉండేది. దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఆనాడు తాను హామీ ఇచ్చానని చెప్పారు. మూడోవిడత సుమారు 400 మందికి శాశ్వత పట్టాలు కల్పిస్తున్నది మీ కూటమి ప్రభుత్వం, బట్టలు పెట్టి పసుపు, కుంకుమలతో పట్టాలు ఇస్తానని అనాడు ఇచ్చిన హామీ ఈరోజు నిలబెట్టుకుంటున్నానని తెలిపారు. మొదటి విడతలో 3,002, రెండోవిడతలో 2,670, మూడోవిడతలో 988 పట్టాలు కలిపి మొత్తం సుమారు రూ.2 వేల కోట్ల విలువ ఆస్తికి ప్రజలకు శాశ్వత హక్కులను ప్రజా ప్రభుత్వం కల్పించిందని మంత్రి లోకేష్ వివరించారు.
రాష్ట్రానికి దిక్సూచిగా మంగళగిరి మోడల్...
మంగళగిరి మొదటి పెట్టిన ప్రక్రియ ఈరోజు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోంది. మంగళగిరిలో పట్టాల సమస్యను తాను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినపుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ సమస్య ఎక్కడున్నా పరిష్కరించాల్సి ఉందని ఆయన తనకు చెప్పారని తెలిపారు. అధికారులు, నాయకులు కనీసం ఒక్క గ్లాను మంచినీరు కూడా తీసుకోకుండా ఇళ్లకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తామంతా ఒక పట్టుదల, కమిట్ మెంట్ తో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. మంగళగిరిలో వేసిన పునాది ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచిగా మారిందన్నారు. ఇటీవల విశాఖపట్నంలో 20వేల పబ్బాలను ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించింది. త్వరలో విజయవాడలో కూడా మరో 24 వేలమందికి అందించబోతోంది. ఇది సీఎం చంద్రబాబుకు పేదల పట్ల ఉన్న కమిట్ మెంట్ అని మంత్రి లోకేష్ అన్నారు.
స్థానిక ఎన్నికలలో కూటమిని గెలిపించాలి...
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గత ఎన్నికల్లో తనను గెలిపించినట్లుగానే కూటమి అభ్యర్ధులను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించండి అని మంత్రి లోకేష్ కోరారు. ఎక్కువ హామీలు ఇవ్వను, ఇచ్చినవన్ని నిలబెట్టుకుంటా అని ఆయన అన్నారు. డోర్ టు డోర్ కార్యక్రమం సమయంలో మీరు చెప్పిన సమస్యలన్నీ రానుకున్నా ప్రతిదీ నేను మానిటర్ చేస్తున్నా పురోగతిపై ప్రతి వారం నమీక్ష చేస్తున్నా. దాంట్లో భాగంగా ఇంటి పట్టాల కార్యక్రమం చేపట్టాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికగా చేయాల్సిన పనులన్నీ తొలుత చేపడుతున్నాం. భూగర్భడ్రైనేజీ, పైప్ లైన్ ద్వారా తాగునీరు, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ ప్రక్రియ పూర్తయిన చోట వెంటనే రోడ్లు వేస్తామని హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.