పాట్నా సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
వివాదాస్పద వ్యాఖ్యలు మోడీపై తీవ్ర విమర్శలు..
బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపైనా ధ్వజం ఖర్గే
రాజకీయ మర్యాదల హద్దులు దాటారన్న అమిత్ షా
మోడీపై వ్యక్తిగత కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదంటూ కౌంటర్
పాట్నా: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. డాక్టర్ శ్రీకృష్ణ సింగ్ 139వ జయంతి సంద ర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే ప్రసంగిస్తుం డగా, సభలోని ఓ వ్యక్తీ ప్రధాని మోడీ ఎక్కడికీ వెళ్లరనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించగా.. వెంటనే ఆగ్రహంతో స్పందించిన ఖర్గే.. మోడీనే కాదు ఆయన తండ్రి కూడా వెళ్లిపోతారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని ఇచ్చిన హామీని ఖర్గే ప్రశ్నించారు. బీజేపీ. ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు సామా జిక సమానత్వానికి విరుద్ధమని అరోపించారు. ఇంట రానితనం కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరడాన్ని కూడా ఖర్గే విమర్శించారు. శుద్ధీకరణ ఘటనను ప్రస్తావిస్తూ కులవివక్షపై ప్రశ్నలు ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగినట్లు పేర్కొంటున్న లేవనెత్తారు. కాగా, ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖర్గే తన వ్యాఖ్యలతో రాజకీయ మర్యాదల హద్దులు దాటారని విమర్శించారు. మోడీతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నేతలు గతంలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ప్రధాని దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలు, మోడీని మృత్యు వ్యాపారిగా అభివర్ణిం చడం, ఆయన సాధారణ నేపథ్యాన్ని కించపరిచేలా చాయ్ వాలా అని సంబోధించడం వంటి గత ఘటనలను ప్రస్తావించారు. గత 12 ఏళ్లుగా వరుస ఎన్నికల పరా జయాలతో కాంగ్రెస్ అసహనానికి గురవుతోందని అమిత్ షా విమర్శించారు. జిల్లే వ్యాఖ్యలు కాంగ్రెస్ రాజకీయ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు.