ప్రకటించిన భారత వాతావరణ కేంద్రం
న్యూఢిల్లీ : వర్షాకాలం ముగిసి నేటితో శీతాకాలం ప్రారంభమైంది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్టోబర్ నెలలో గరిష్ఠ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ సీజన్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ విడుదల చేసిన శీతాకాలం బెట్ల లుక్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా అక్టోబర్ నెలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉ ందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 18 శాతం లోటు వర్షపాతం నెలకొన్నట్లు వెల్లడించింది. 14 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొన్నట్లు తెలిపింది. అత్యధిక లోటు వర్షపాతం ఉన్న జిల్లాలుగా నల్గొండ, నిర్మల్, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజిగిరి నమోదయ్యాయి. కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో సాధారణం కన్నా అత్యధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణపై ప్రభావం చూపేలా ఏడు అల్పపీడనాలు ఏర్పడగా అందులో ఆరు వాయుగుండాలు, మూడు తీవ్ర వాయుగుండాలుగా మారి ఈ వర్షపాతానికి కారణమయ్యాయి. జూన్ మాసంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడంతో లోటు వర్షపాతానికి దారి తీసినట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈసారి భారత్” లోకి నైరుతి ఆగమనం ఆలస్యమైంది. భారత వాతావరణ శాఖ మే 26న నైరుతి రుతువవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసినప్పటికీ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. జూన్ 1వ తేదీన కూడా ప్రవేశించలేదు. నాలుగు రోజులు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించాయి. తెలంగాణలోకి సరైన సమయంలోనే అంటే జూన్ 8న ప్రవేశించినప్పటికీ వారం రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లా అయిన జోగులాంబ గద్వాల్ ప్రాంతంలోనే ఆగిపోయాయి. వారం రోజుల తరువాత మందకోడిగా ముందుకు కదిలి వదిహేను రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు ఏడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ అల్పపీడనాలు ఆరు వాయుగుండంగా మారాయి. ఈ ఆరు వాయుగుండాల్లో మూడు తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది రాష్ట్రంలో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం నెలకొనగా ఇది రీతాకాలంపైనా ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ ప్రకటించిన ఔట్లుక్లో వెల్లడించింది. అక్టోబర్ మానంలో వగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా అక్టోబర్ మానంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉ టుందని చెప్పింది. తెలంగాణాలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఏర్పడుతుందని పేర్కొంది. ఈ తీవ్ర ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.