టెన్నిస్ ప్రపంచంలో పెను సంచలనం నమోదైంది. సెర్బియా స్టార్, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్ లో అనూహ్య పరాభవం ఎదురైంది. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన జొకోవిచ్, తొలి రౌండ్లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అర్జెంటీనా ఆటగాడు మరియానో నవోనే చేతిలో ఓడిపోయి అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చాడు. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడిన జోకోవిచ్, మ్యాచ్ చివరి దశలో కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యాడు. ఆర్థర్ యాష్ స్టేడియంలో నాలుగు గంటలకు పైగా సాగిన ఈ హోరాహోరీ పోరులో నవోనే 7-6(5), 5-7, 4-6, 6-2, 6-1 తేడా తో జొకోవిచ్ పై చారిత్రక విజయం సాధించాడు. తొలి సెట్ కోల్పోయినప్పటికీ, 39 ఏళ్ల జొకోవిచ్ అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు, మూడు సెట్లను గెలుచుకుని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే, ఆ తర్వాత అతని శరీరం సహకరించలేదు. న్యూయార్క్ లోని తీవ్రమైన తేమతో కూడిన వాతావరణం మ్యాచ్ ఆరంభం నుంచే జొకోవిచ్‌ను ఇబ్బంది పెట్టింది. అతను పదేపదే ఐస్ ప్యాక్‌లు అద్దుకుంటూ, తీవ్ర అస్వస్థతతో కనిపించాడు. మూడో సెట్ సమయంలో పలుమార్లు వాంతులు కూడా చేసుకున్నాడు. దీంతో టోర్నమెంట్ ఫిజియోథెరపిస్ట్ కోర్టులోకి వచ్చి చికిత్స అందించి, కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు. అయినప్పటికీ, నాలుగో సెట్ నుంచి నవోనే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లో ప్రత్యర్థి ఆధిక్యంలో దూసుకెళు _న్నప్పుడు, గంటల తరబడి అనారోగ్యంతో, వేడితో, ప్రత్యర్థితో పోరాడి అలసిపోయిన జొకోవిచ్ తన భావోద్వేగాలను అదువు చేసుకోలేక కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్టాండ్స్‌లో ఉన్న అతని భార్య జెలెనా కూడా తీవ్ర ఆందోళనతో కనిపించారు. ఈ ఓటమితో గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో వరుసగా 78 తొలి రౌండ్ విజయాల జొకోవిచ్ అసాధారణ రికార్డుకు తెరవడింది. అతను చివరిసారిగా 2006 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఒక మేజర్ టోర్నీ తొలి రౌండ్లో ఓడిపోయాడు. ఈ ఫలితంతో 25వ మేజర్ టైటిల్ సాధించాలన్న అతని ప్రయత్నానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలే సిన్సినాటి ఓపెన్ లోనూ వేడి కారణంగా ఇబ్బందిపడిన జొకోవిచ్, తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే యూఎస్ ఓపెన్‌లో అడుగుపెట్టడం గమనార్హం.