అభివృద్ధి లక్ష్యం ప్రతి ఒక్కరి సంక్షేమం కావాలి
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేలా ఉండాలి
సంపద, అవకాశాల పంపిణీలో అంతరాలు తగ్గించాలి
సమాజంలో చివరి వ్యక్తి కూడా సంతోషంగా ఉండాలి
యావత్మాల్ సమావేశంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్
ముంబై: దేశ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల మధ్య ఆర్ధిక, సామాజిక అసమానతలు పెరగకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి విధానాలు రూపొందించాలని ఆయన సూచించారు. చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ప్రయోజనాలు చేరినప్పుడే సమగ్ర ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. మహారాష్ట్రలోని యవత్మా ల్లో లో పండిట్ దీన్ దయాళ్ ఉ పాధ్యాయ జయంతి సంద ర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవత్ ప్రసంగిం చారు. అభివృద్ధి కేవలం ఆర్థిక వృద్ధికి పరిమితం కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ఉండాలని భగవత్ పేర్కొన్నారు. సంవద, అవకాశాల పంపిణీలో అంతరాలు తగ్గించేందుకు కృషి చేయాలని అన్నారు. దేశం సంతోషంగా ఉండాలంటే సమాజంలోని చివరి వ్యక్తి కూడా అత్యంత సంతోషంగా ఉండాలని, దీనినే అంత్యోదయ అంటారని ఆయన చెప్పారు. అందరూ ఒకే స్థాయి అభివృద్ధిని సాధించలేకపోవచ్చు కానీ, ఆ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇంత పెద్ద సమాజంలో అందరూ ఒకే అభివృద్ధి స్థాయిలో ఉండలేరని కొందరు అనవచ్చు. అది సహజమేనని ఆయన అన్నారు. అయితే, అభివృద్ధిలో అత్యల్ప, అత్యున్నతస్థాయి ల మధ్య అంతరం సాధ్యమైనంత తక్కువగా ఉండాలని ఆయన సూచించారు. సమాన అవకాశాలు, సామాజిక బాధ్యత పెంపొందించా ల్సిన అవసరం ఉండని ఆయన వివరించారు. దేశ పురోగతిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉ ండేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
అట్టగుడుగు వ్యక్తిని దృష్టిలో పెట్టుకోవాలి..
నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్న వ్యక్తిని దృష్టిలో ఉ ంచుకోవాలన్న మహాత్మా గాంధీ నూత్రాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆహారం, దుస్తులు, నివాసం వంటి కనీస అవసరాలు తీరడంతో పాటు విద్య, వైద్య వదుపాయాలు అందేలా అభివృద్ధి ఉండాలని భగవత్ అన్నారు. అయితే, ప్రకృతిని దెబ్బతీసేలా అభివృద్ధి ఉండకూడదని ఆయన హెచ్చరించా. రు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న కరవు పరిస్థితుల నేపథ్యంలో, మిశ్రమ, సేంద్రీయ వ్యవసాయా న్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.