ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవి చిన్నకుమార్తె ఖుషీ కపూర్ పరిచయం అవసరం లేదు. సినిమాలతో కంటే డేటింగ్ వ్యవహారాలతో ఈ భామ పేరు మార్మోగుతోంది. నటించిన రెండు మూడు సినిమాలు ప్లావులు అయినా ఈ యంగ్ బ్యూటీ తన సోషల్ మీడియాల ద్వారా బాగానే ఆర్జిస్తుండటం నిరంతరం చర్చగా మారుతోంది. ఖుషీ సినీ కెరీర్ జర్నీని పరిశీలిస్తే... ఇప్పటివరకు ఖాతాలో ఒక్క సరైన హిట్ కూడా పడలేదు. నటనవరంగా చూస్తే.. తన సోదరి జాన్వీ కపూర్ కనీసం తన మొదటి సినిమా-ధడక్ తో అందం. నటనతో ప్రేక్షకులను కొంతవరకు మెప్పించగలిగింది. కానీ ఖుషీ కపూర్ పరిస్థితి మాత్రం అందుకు వూర్తి భిన్నంగా తయారైంది. బాలీవుడ్లో-ది ఆర్చీస్ అనే అవుట్ డేటెడ్ ఓటీటీ ప్రాజెక్ట్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ కపూర్ గాళ్, ఆ తర్వాత కూడా వరుసగా పెద్దగా స్టార్ డమ్ లేని కొత్త హీరోల సరసన నటిస్తూ ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ ఫ్లావులను ఎదుర్కొంది. సినిమా కెరీర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా.. ఖుషీ కపూర్ సంపాదనకు మాత్రం ఎలాంటి డోకా లేదు. బాక్సాఫీస్ వద్ద సినిమాలు డిజాస్టర్లుగా మిగిలినా.. సోషల్ మీడియా వేదికగా తనకు ఉన్న క్రేజ్- పావులారిటీతో భారీగానే ఆర్జిస్తోంది. నిరంతరం పాపులర్ బ్రాండ్లకు మోడలింగ్ చేయడం, ఎండార్స్మెంట్లు- ప్రమోషనల్ యాడ్స్ ద్వారా కోట్లు గడిస్తోంది. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా స్టార్ డ మ్ తోనే సొంతంగా సంపాదించే స్థాయికి చేరుకోవడం విశేషం.