శాంతి భద్రతల్లో ఆదర్శంగా ఏపీ బాధితులకు
భరోసాగా పోలీసు శాఖ పోలీస్ అమరవీరుల
సంస్మరణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
అమరావతి : శాంతిభద్రతల పరిరక్షణలో ఏపీ పోలీసు శాఖ దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు. నేరస్తులకు పోలీసు యూనిఫాం చూస్తే భయం కలగాలని, బాధితులకు భరోసా ఏర్పడాలని అన్నారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగించే పరిస్థితులు కల్పించాలని పోలీస్ శాఖకు సూచించారు. మంగళగిరిలోని ఏపీఎన్స్ 6వ బెటాలియన్ లో బుధవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్కరణ చీనం కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ బాకీ అంటే బాధ్యత.. పోలీసు అంటే భరోసా అని, ఆపదలో ఉన్నవారికి పోలీసులే ధైర్యం, ధైర్యమని అన్నారు. ప్రమాదం జరిగినా, నేరం జరిగినా ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులేనని చెప్పారు. ప్రజల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేందుకు పోలీసులు తమ కుటుంబాల పండుగలకు దూరమవు తున్నారని అన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్, వీఐపీల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దసరా ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా ప్రజలు నిర్వహించు కోవటంలో పోలీసుల నిరంతర శ్రమ అభినందనీయమని అన్నారు. 1969 అక్టోబరు 21న లడఖ్ లో చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ వదిమంది పోలీసులు వీరమరణం పొందారని, వారి త్యాగానికి గుర్తుగా ఏటా ఈ రోజును పోలీసు అమరవీరుల సంస్కరణ దినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశరక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను స్మరించుకోవడం కేవలం సానుభూతి కాదని, సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.
శాంతిభద్రతలతోనే పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో ఫ్యాక్షన్ను నియంత్రించడంలో, నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో, మత కలహాలను అరికట్టడంలో పోలీసులు అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని గుర్తుచేశారు. శాంతిభద్రతలు, అభివృద్ధి, ఉపాధి, ప్రజల సుఖసంతోషాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని చెప్పారు. భద్రతపై నమ్మకం జన్న ప్రాంతాలకే పెట్టుబడులు వస్తాయని, పరిశ్రమలు ఏర్పాటై ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. అందుకే తాను అధికారంలో ఉన్నప్పుడల్లా శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ఇటీవల ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దేశ ప్రతిష్ఠను మరింత పెంచిందని అభినందించారు. పోలీసు భద్రతకు భంగం కలిగించే కుట్రలను ఛేదించి పోలీసు శాఖ విధుల్లో దైద్యంతోపాటు మానవత్వం కూడా అవసరమని సీఎం సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరూ తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో వస్తారని, కొందరు భయంతో, మరికొందరు కన్నీళ్లతో వస్తారని చెప్పారు. వారి సమస్యలను సానుభూతితో విని, గౌరవంగా వ్యవహరించి, సత్వర పరిష్కారం చూపాలని కోరారు. పోలీసుల తక్షణ రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని స్పందన ప్రజల్లో నమ్మరాన్ని పెంచాలని పేర్కొన్నారు. ఉ పేక్షించకూదదని, రాజకీయాలు నేరస్థులకు రక్షణ కల్పించకూడదని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీలు, సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.