క్రికెట్లో నేపాల్ జట్టు సంచలనం సృష్టించింది. కొరోగి స్పోర్ట్స్ పార్స్‌లో జరిగిన ఆసియా క్రీడల గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో పటిష్టమైన ఆఫ్ఘనిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ సమష్టిగా రాణించి ఆఫ్ఘన్ జట్టుకు షాకిచ్చింది. మొదట బౌలర్లు కట్టడి చేయగా, ఆ తర్వాత బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆది జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్‌ను నేపాల్ స్పిన్నర్లు కుశాల్ భుర్టెల్, లలిత్ రాజ్బంకీ తమ స్పిన్‌తో కట్టిపడేశారు. వీరి ధాటికి ఆఫ్ఘన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. భుర్టెల్ 4 వికెట్లు పడగొట్టగా, రాజ్‌బంశీ కేవలం 13 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ స్వేచ్ఛగా ఆడలేకపోయింది. ఫైనల్ షినోజాదా (30), నజీబుల్లా జద్రాన్ (30) మాత్రమే కాస్త పోరాడటంతో ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు భుర్టెల్ (0), ఆసిఫ్ షేక్ (2) త్వరగా ఔటయ్యారు. కుశాల్ మల్లా కూడా రనౌట్ కావడంతో నేపాల్ 6.3 ఓవర్లలో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో నుందీప్ జోరా (34), రోహిత్ పౌడెల్ (33 నాటౌట్) బాధ్యతాయుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకొని, స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు నడిపించారు. కీలక సమయంలో నుందీప్ జోరా రనౌట్ అయినా, కెప్టెన్ దీపేంద్ర సింగ్ ఐర్ (15)తో కలిసి రోహిత్ పొదెల్ జట్టును విజయానికి చేరువ చేశాడు. పౌడెల్ 16, 17 ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి ఒత్తిడి తగ్గించాడు. విజయానికి ఒక్క పరుగు దూరంలో డిపేంద్ర ఔటైనా, గుల్షన్ ఝా సింగిల్ తీసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో నేపాల్ తమ ఖాతా తెరిచింది. గ్రూప్-ఏలో ఆఫ్ఘనిస్థాన్ రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిచి, ఒకటి ఓడినా.. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా టేబుల్ అగ్రస్థానంలో ఉంది. నేపాల్ తన తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. గ్రూప్‌లో టాప్-2 జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.