సర్ ప్రక్రియతో ఆ కుట్రకు తెరతీసారు
అభిజీత్ స్క్రీన్స్, ట్రూవ్ రాఠీ, ప్రకాశ్ రాజ్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. కొద్ది రోజులుగా ఈ సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, ఇతర ప్రతిపక్ష పార్టీలు సహా కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర పౌర సమాజ సంఘాలు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే వర్గాల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడానికే ఈ నర్ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీజేపీ, ఇతర పౌర సమాజ ప్రతినిధులతో కలిసి బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కులో 'పీపుల్స్ టైబ్యునల్ పేరిట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభిజీత్ దీప్కే సహా ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, నటుడు, కార్యకర్త అయిన ప్రకాశ్ రాజ్- ఎన్నికల సంఘం తీరుపై విరుచుకుపడ్డారు. సర్ ప్రక్రియను తీవ్రంగా విమర్శించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు తాము బతికే ఉన్నాయని చూయించేందుకు ఈ కార్యక్రమానికి వచ్చారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వారిలో కొందరిని వేదికపైకి తీసుకొచ్చి 'వారు భౌతికంగా చనిపోలేదు. కానీ మన దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతోంది.' అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల ఓట్లు, ఇంకా ఒక్క కర్ణాటకలోనే దాదాపు కోటి ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు. ఓట్లను తొలగించి, దొంగిలించి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారని విమర్శించారు. ప్రధాని, ఎన్నికల సంఘం కలిసి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అన్నారు. మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతోనే సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల సంఘం అధికారులు ఓట్లు తొలగిస్తున్నారని విమర్శలు చేశారు. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అడ్డుకోవాలని దీప్కే పిలుపునిచ్చారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీ తరఫున ఈ కార్యక్రమానికి రాలేదని, కేవలం సాధారణ పౌరుడిగా పాల్గొన్నట్లు తెలిపారు. అలానే ఓట్ల చోరీ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన సమన్య కాదని, ప్రతి పౌరుడికీ సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పూర్తిగా లోపించాయని, ఓటరు జాబితా నుంచి పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించడం, కొత్తగా చేర్చడం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశించే వరకు బిహార్లో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాల్ని ఎన్నికల సంఘం ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. బంగాల్లో లోనూ ఎన్నికలకు ముందు సుమారు 70 వేల మంది ఓటర్ల పేర్లను తొలగించి, ఫలితాల తర్వాత మళ్లీ చేర్చారని ధ్రువ్ రాఠీ ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. నటుడు, కార్యకర్త ప్రకాశ్ రాజ్ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రక్రియతో ఓట్ల తొలగింపు కేవలం ఓటు హక్కుపై దాడి మాత్రమే కాదని, ఇది దేశ ప్రజల ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడి అని అభివర్ణించారు. 'మా పోరాటం కేవలం జ్ఞానేశ్ కుమార్ రాజీనామాతోనే ఆగిపోదు. ఒక వ్యక్తి స్థానంలో మరో వ్యక్తి వచ్చినా ఎలాంటి మార్పు ఉండదు. ఈ నర్ ప్రక్రియనే పూర్తిగా రద్దు చేయాలి.' అని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. గిరిజనులు, ముస్లింలు, పేదలు, ఇతర మైనారిటీ వర్గాల ఓటర్లనే లక్ష్యంగా చేసుకొని వారి ఓట్లను తొలగిస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక నిరసనకారులు తమ ఆందోళనలను శాంతియుతంగా కొనసాగించాలని, పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు వారి తరఫున తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.