కాంగ్రెస్ వీ దింపుడు కళ్లం
ఆశలు ప్రపంచ శక్తులు ఏకమైనా
మోడీ ప్రభుత్వాన్ని కూల్చలేరు
దేశంలో ఓట్ చోరీ జరగలేదు..
అజిత్ దోవల్‌ను రాజకీయాల్లోకి లాగటం
దుర్మార్గం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: దేశ ప్రజలు 2029 వరకు ప్రధా నిగా మోడీ ఉండాలని తీర్పునిచ్చారని, కానీ ప్రజా తీర్పును బేఖాతరు చేస్తున్న కాంగ్రెస్, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో మోడీ ప్రభుత్వాన్నీ కూల్చుతామని దింపుడు కల్లం ఆశలు పెట్టుకుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రపంచమంతా ఆర్ధిక సంక్షోభంలో ఉన్న వేళ మోడీ నేతృత్వంలో భారత్ మాత్రం అభివృద్ధి చెందుతోందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరనీ, ప్రభుత్వాన్ని కూల్చుతామని బెదిరించడం కాదని దమ్ముంటే కూల్చి చూపించాలని సవాల్ విసిరారు. ప్రపంచ శక్తులు ఏకమైనా మోడీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరోపిస్తున్న దేశంలో ఓట్ చోరీ జరగలేదని తేల్చి చెప్పారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు ప్రకాష్ రెడ్డి, చీకోటి ప్రవీణ్ కుమార్, విజయలక్ష్మి, సమతతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులను ప్రతిపక్ష పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో ఆరాచకం సృష్టించేందుకు, కేంద్రాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నా రని మండిపడ్డారు. లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ దిగజారి మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం, ఈవీఎంలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ గెలిస్తే జ్ఞానేశ్ కుమార్, ఈవీఎంలను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. జ్ఞానేశ్ కుమా రీను వదిలిపెట్టబోమని రాహుల్ గాంధీ అంటున్నారని, ఆయన దాదాగిరి చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కేరళలో వాళ్ళు గెలిస్తే ఈసీ, ఈవీఎంలు బెస్ట్ అని.. బీజేపీ గెలిస్తే మెషీన్ల తప్పని వితండ వాదం సరికాదన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ బోవల్ పేరును కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్బీఆర్) తో సంబంధం లేకుండానే గతంలో బీజేపీ అనేక రాష్ట్రాల్లో విజయం సాధించిందని గుర్తుచేశారు. అజిత్ దోవల్ పేరు చెబితే పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయని వ్యాఖ్యానించారు. దేశ య-వత హృదయాల్లో అజిత్ దోవల్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం బ్లాక్మెయిల్ చేసేలా రాహుల్, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తీర్పులు అనుకూలంగా రాకపోతే న్యాయ మూర్తులను తప్పువడుతున్నారని విమర్శించారు. మహిళా ఉద్యోగి పట్ల రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ. అనుచితంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు.
తెలంగాణలో అరెస్టులు... ఢిల్లీలో ఉపన్యాసాలు
తెలంగాణలో ప్రతిపక్ష నేతలను నిత్యం అరెస్టు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఢిల్లీలో మాత్రం పెద్ద పెద్ద ఉ వన్యాసాలు ఇస్తున్నారని శివ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు, ఢిల్లీలో చేస్తున్న ప్రసంగాలకు మధ్య వ్యత్యాసం ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని జలహీనపరిచేందుకు కొందరు విదేశాల నుంచి వచ్చి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకరు జర్మనీ నుంచి, మరొకరు అమెరికా నుంచి వచ్చి దేశంలో కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీని చూసి దేశ ప్రజలు నవ్వుకుం టున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సింగరేణిని సంక్షోభంలోకి నెట్టింది ముమ్మాటికీ బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలేనని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే నైతిన హక్కు కాంగ్రెస్‌కు లేదని దుయ్యబట్టారు. సింగరేణిలో బొగ్గు దొంగతనం జరగలేదని స్పష్టం చేశారు.