పెండింగ్ భూసేకరణ అంశాలను
ప్రాధాన్యతతో పరిష్కరించాలి
రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు
భూసేకరణ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, : రైల్వే ప్రాజెక్ట్, భూసేకరణ, జాతీయరహదారులు వనులు సంబంధించి పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికబద్ధంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మిని సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూ సేకరణ పనుల పై జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావుతో కలసి జిల్లాలోని తహశీల్దార్లు, ఆర్థిఓలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తిరుపతి ఆర్థిఓ రామ్మోహన్, శ్రీకాళహస్తి ఆర్డిఓ బాను ప్రకాష్ రెడ్డి. జాతీయ రహదారుల శాఖ పిడి వెంకటేశ్వరులు, ఏపీఐఐసీ తిరుపతి జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ భగవాన్, సంబంధిత తహసీల్దార్లు, డెప్యూటీ తహసీల్దార్లు, సెక్షన్ అధికారులు భూసేకరణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ ప్రాజెక్టుల వారీగా భూసేకరణ పురోగతిని సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న అంశాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అవార్డు ప్రక్రియ పూర్తయిన గ్రామాల్లో సంతకాలు, నిధులు బదిలీ, పరిహారం చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గూడూరు--రేణిగుంట రైల్వే ప్రాజెక్టుతో పాటు ఇతర రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన మార్కెట్ విలువల నిర్ధారణ, వెరిఫికేషన్, అవార్డు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. మిగిలిన ప్రతిపాదనలను పరిశీలించి ఈ వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిస్సింగ్ సర్వే నంబర్లు, డాటెడ్ ల్యాండ్స్, పెండింగ్ ఎక్స్టెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత రెవెన్యూ, సర్వే అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన నోటిఫికేషన్లు జారీ చేసి తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీకాళహస్తి ప్రాంతానికి సంబంధించిన భూసేకరణ అంశాలను సమీక్షిస్తూ, హ్యాండోవర్ చేసిన భూములు, అవార్డు ప్రొసీడింగ్స్‌లో ఉన్న సర్వే నంబర్లను సరిపోల్చాలని, ఏమైనా మిస్సింగ్ ఉంటే వెంటనే గుర్తించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. టిటిడి భూములకు సంబంధించి 22-ఏ నుంచి తొలగించాల్సిన భూముల వివరాలను కూడా త్వరగా సిద్ధం చేయాలని సూచించారు.ఆర్‌అంర్‌ఆర్ ప్యాకేజీలకు సంబందించి అభ్యంతరాల వరిశీలన, తుది నివేదిక తయారీ, కమిషన్‌కు ప్రతిపాదనలు పంపడం వంటి ప్రక్రియలను వేగవంతం చేయాలని తెలిపారు. ఆమోదం పొందిన ఎక్స్రేషియా, వరిహారం మొత్తాలను లబ్దిదారులకు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ రహదారుల పరిధిలోని ఆలయాల తరలింపు, ప్రత్యామ్నాయ స్థలాల ఏర్పాటు వంటి అంశాలను ఎండోమెంట్, టీటీడీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. పెండింగ్ అంశాలను వచ్చే సమీక్ష నాటికి పరిష్కరించి, ప్రాజెక్టుల వనులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అధికారి తన వరిధిలోని పెండింగ్ పనులకు స్పష్టమైన గడువు నిర్ణయించుకుని, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.