హింసా రాజకీయాలు చంద్రబాబుకు కొత్తకాదు.
ధైర్యం... సహనంతో ఎదుర్కొందాం
ఎంపీకే భద్రతలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి
న్యాయపోరాటం చేద్దాం: జగన్ ఎంపీ మిథున్ రెడ్డికి ఫోన్లో పరామర్శ
అమరావతి, : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి సర్కార్ అరాచకాలకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ధ్వజమెత్తారు... పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిచే యటాన్ని తీవ్రంగా కూటమి అరాచకాలు బండించారు. ఫోన్లో ఆయన్ను పరామర్శించిన జగన్ టీడీపీ దాడుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదనేది దీన్నిబట్టి స్పష్టమవుతోందన్నారు. రెండున్నరేళ్ల పాలనపట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అందువల్లే అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసా రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌లో మార్చారని మండిపడ్డారు. లోకసభలో పార్టీ నాయకుడికే భద్రతలేని పరిస్థితులు చూస్తున్నాం.. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అన్నారు. పోలీసులను ప్రయోగించి ఆక్రమాలు సాగిస్తున్నారని దాడులు జరుగుతున్నా పోలీసు వ్యవస్థ నిస్తేజం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ అన్యాయాలను సమర్ధంతంగా ఎదుర్కొంటాం.. న్యాయపరంగా, చట్టవరంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తాం.. ధైర్యం, సహనంతో నంతో దాడుల్ని ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను కోర్టుల ముందు ఉ ంచుతాం.. పారామిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కోర్టుల ముందు ఉంచుతామన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర తమదని హింసతో రాష్ట్రాన్ని నాశనంచేస్తున్న చరిత్ర చంద్రబాబుదని వ్యాఖ్యానించారు.