అయన చెప్పేవన్నీ అబద్దాలే..
సొంతనలేని లెక్కలు సీసీ కెమెరాలతో పంట నష్టం
అంచనాలు ఓ ఫార్స్ బియ్యం ఎగుమతుల్లో సిండికేట్లు, సీజ్ లేదు..
షిప్ లేదు పయ్యావుల వ్యాపారం.. చినబాబు, మనోహరు కమీషన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫైర్
అమరావతి, : అర్నబ్ తుపాను నష్టం అపారం.. కూటమి ప్రభుత్వం బాధితులను అదుకోవటంలో పూర్తిగా విఫలైంది.. సీసీ కెమేరాలతో పంటల నష్టం... ఆర్టీజీఎస్ సమీక్షల పేరుతో చంద్రబాబు హైడ్రామా ఆడుతున్నారు... పంటల నష్టంపై పూటకోలెక్క చెబుతున్నారు.. ఆయన వన్నీ అబద్దపు మాటలు.. అర్బాటపు ప్రచారాలేనని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తుపాను ప్ర భావిత ప్రాంతాల్లో పరిస్థితి.. ప్రభుత్వ సాయంపై తెలుసుకునేందుకు గురువారం వైసీపీ కేంద్రకార్యాలయం నుంచి రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో తుపాన్ ప్రభావం, రైతులకు కలిగిన నష్టం, ప్రజలు, రైతులను అదు కోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీజీఎస్లో సమీక్షల పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ఆక్షేపించారు.. అబద్దాలు ప్రచారం చేస్తూ కేవలం ఆర్బాటం కోసం తాపత్రయ పడుతున్నారని.. ని.. సీసీ కెమెరాల ద్వారా పంట నష్టం అంచనా ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పంట నష్టంపై పూటకో లెక్కలు చెబుతున్నారు.. ఏమీ చేయకపోయినా అన్నీ చేశామంటూ ప్రచా రం చేసుకుంటున్నారు.. ఉచిత పంటల బీమా లేక రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు అర్బీకేలు. ఈ క్రాప్ పూర్తిగా నిర్వీర్యంచేశారు.. సున్నా వడ్డీ పంట రుణాలు లేవు. గిట్టుబాటు ధరలూ లేవు.. మొంథా తుపాన్ నష్టానికి ఇప్పటికీ ఇస్సుట్ సబ్సిడీ అందలేదు.. దాదాపు రూ.600 కోట్లు బకాయి పడిన కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయంలోనూ రైతుల్ని దగా చేస్తోందని మండిపడ్డారు. మూడేళ్లకు కలిపి మొత్తం రూ.60 వేలు ఇవ్వాలి.. ఇచ్చింది కేవలం రూ.19 వేలు. బకాయి.. రూ.41 వేలు.. మొన్నటి వరకు కరవు పరిస్థితి. ఇప్పుడు తుపాను... అటు, ఇటూ రోలురోలేక దారుణంగా రైతులు నిలువునా మునిగినా కూటమి ప్ర భుత్వంలో చలనం రాలేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో రైతులు, ప్రజలకు పూర్తి అందగా ఉండాలి.. నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయిలో మమేకం కావాలి.. ప్రతి అడుగులో రైతులు, ప్రజలకు తోడుగా నిలబడాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించండి.. రైతులు, ప్రజలకు తోడుగా, అండగా నిలబడండి.. వారి వెన్నంటి ఉన్నామనే భావన బాధితుల్లో కల్పించండి. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మరోవైపు కేజీ బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు చేరింది. మొత్తం సిండికేట్గా మారి బియ్యం ఎగుమతి చేస్తున్నారు. సీజ్ ది షిప్ అన్నారు. సీజ్ లేదు. షిప్ లేదని గతంలో పవన్ కళ్యాణ్ అదేశాల నుద్దేశించి జగన్ చురకలం టించారు. పయ్యావుల వ్యాపారం.. చినబాబు, నాదెండ్లకు కమీషన్.. ఇదీ వరుసన్నారు. కృష్ణా, గోదావరి డెల్టాలో పండించిన పంటలు చేతికి రాక, ఇంకా నష్టం జరుగుతోంది. దీంతో బియ్యం ధరలు ఏ స్థాయికి చేరతాయా అని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకమై వారికి అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు జగన్ దిశా నిర్దేశం చేశారు. పార్టీస్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎంపియన్ నాగిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కరెడ్డి, మండలి డిప్యూటి చైర్మన్ తూమాటి మాధవరావు తదితరులు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.