వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్
అమరావతి, : రాష్ట్రంలో స్థానిక నం స్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తా మంటూ చంద్ర బాబు చేసిన వాగ్ధానాలు వచ్చి బూటకమని, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆయన నయ వంచన పూర్తిగా బట్టబయలైందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడంలో ఆయన 420 అని మరోమారు స్పష్టమైందన్నారు. ఇప్పటికైనా బీసీలకు క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన 'ఎక్స్'లో పోస్టు చేశారు. "చంద్రబాబు గారూ.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీం కోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది. మీరు పెద్ద మోసకారి అని మరోసారి తేలిపోయింది. సూపర్ సిక్స్, నూవర్ సెవెన్ పేరిట మీరు ఇచ్చిన హమీలు మోసం. గతంలో మా ప్రభు త్వంలో వారికి వచ్చే పథకాలు రద్దు చేయడం మరొక మోసం, విద్యా దీవెన, వసతి దీవెన లకు దాదాపు రూ.9 వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం. 143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం. చివరకు వీసీలకు 34 శాతం రిజర్వే షన్లు ఇస్తున్నట్లు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే" అని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.
చంద్రబాబు కొత్త నాట కానికి తెరతీశారు
34శాతం బీసీ రిజర్వేషన్ అమలు కాదని ముందే తెలుసు: బొత్స
విజయనగరం : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి, ఆచరణలో విఫలమై.. కొత్త నాటకానికి సీఎం చంద్రబాబు తెరతీశారని శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ ఆరోపించారు. శుక్రవారం విజయనగ రం జిల్లాలో ఆయన మాట్లాడారు. 'గతంలో సుప్రీం కోర్టు 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని తీర్పు ఇచ్చింది. దాన్ని విస్మరించి బీసీల కు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించారు. దీన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులు తిరస్కరించాయి. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రాజ్యంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావచ్చు. చంద్రబాబుకు ఎన్నికలంటే భయం. ప్రభుత్వం పోలీసుస్టేషన్లను అడ్డుపెట్టుకున్నట్లే, న్యాయస్థానాలనూ అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నించటం పొరపాటు. మేం ఎన్నికలకు సిద్ధమవుతూ అభ్యర్థులను ఎంపిక చేసుకునే స్థితిలో ఉన్నాం. అలాంటిది మేం ఎన్నికలను ఎందుకు అడ్డుకుంటాం'' అని బొత్స ప్రశ్నించారు.