తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన మంగళవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా బేడి ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల సడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకు న్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళమాత, విమాస వేంకటేశ్వర స్వామి, భాష్యకారుల సన్నిధి, యోగ సరసింహస్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపం లో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ముఖ్య మంత్రిని ఆశీర్వదిం చారు. టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదా లతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామివారి కలంకారీ చిత్రపటాన్ని ముఖ్యమంత్రికి అంద జేశారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్చార్జి మంత్రి, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరా యుడు, అదసవు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వి మురళీకృష్ణ, ఎన్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.