మహాత్మా.. మోదీ, జ్ఞానేశ్‌లకు సద్బుద్ధి ప్రసాదించు!.
రాజ్ ఘాట్ వద్ద ఇండి కూటమి వినూత్న నిరసన..
మహాత్ముడికి నివాళి అర్పించి.. 2 గంటలు ధర్నా
మోదీ, అమిత్, మోహన్ భాగవత్, జ్ఞానేశ్ కుట్రలతో దేశాన్ని
హైజాక్ చేశారు వారికి శిక్షపడటం ఖాయం: రాహుల్ గాంధీ
ఇండి కూటమి ఎంపీలకు రెస్టారెంట్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు
చేసిన కాంగ్రెస్ అక్కడి నుంచి రాజ్ ఘాటు వెళ్లిన నేతలు పోలీసులపై
దాడి చేశారంటూ రాహుల్, ప్రియాంక, నేతలపై మూడు కేసులు నమోదు
సీఈసీ జ్ఞానేశకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ : 'ఓ బాపూ ప్రధాని మోడీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌లకు మంచి బుద్ధిని ప్రసాదించు' అంటూ మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ వద్ద ఇండి కూటమి నేతలు వినూత్నంగా నిరనన చేవట్టారు. గురువారం మూడు బస్సుల్లో ర్యాలీగా రాజట్కు వచ్చిన ఇండి కూటమి ఎంపీలు, నేతలు.. మహాత్మా గాంధీకి నివాళులు అర్పిం చారు. కొంతసేపు మౌనంగా బైరాయిం చారు. అనంతరం బీజేపీ ఓటుచోరికి పాల్పడుతోందని ఆరోపిస్తూ సుమారు. రెండు గంటల పాటు ధర్నా చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ను తొలగించాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళన గురువారంతో మూడో రోజుకు చేరుకుంది. కాగా, ఈ అంశంలో ఇండి కూటమి నేతలు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. కానీ రాష్ట్రపతి కార్యాలయం ఇంకా నమ యాన్ని కేటాయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేన్ వేణుగోపాల్ తెలిపారు.
మూడో రోజూ విందు.. నిరసనలు...
సీఈసీ జానేన కుమార్‌ను తొలగించాలంటూ ప్రతి పక్ష ఇండి కూటమి చేపట్టిన ఉద్యమానికి విందు రాజ కీయాలతో ఊపు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్ని స్తోంది. బుధవారం ప్రతిపక్షాల ఎంపీలకు సాగరత్న హోటల్లో విందు ఇచ్చి, తర్వాత అంతా కలిసి ఆందో ళనకు వెళ్లిన తరహాలోనే.. గురువారం కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున బరే విందు ఇచ్చారు. సెంట్రల్ ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో మోయెట్స్ రెస్టారెంట్లో ఇండి కూటమి ఏంపీలు, నేతలకు మధ్యాహ్న భోజనం "ఏర్పాటు చేశారు. అనంతరం మూడు బస్సుల్లో రాజ్ మాటకు బయలుదేరారు. బుధవారం గైరాజరైన ఎస్సీ, "శివ సేన యూబీటీ, ఎన్నీ పీ- ఎన్ని నేతలు గురువా రం విందుకు హాజరై, ఆందోళనలో పాల్గొన్నారు. ఇందులో ఖర్గే, రాహుల్ గాంధీ. ప్రియాంక కేనీ వేణుగోపాల్, జైరాం రమేశ్ మరికొందరు కాంగ్రెస్ ఎంపీలతోపాటు టీఎంసీ, ఎస్సీ, సీపీఎం, సీపీఐ, అరేడీ ఎంపీలు, సీఎం. రేవంతరెడ్డి, డిహ్యటీ సీఎం భటి, హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుకు కూడా విందులో పాల్గొన్నారు.
రాహుల్, ప్రియాంకపై 3 కేసులు నమోదు
బుధవారం ఢిల్లీలోని షాంగ్రీలా హోటల్ నమీ సంలో పోలీసులపై దాడి చేశారంటూ రాహుల్, ప్రియాంక, మరికొందరు నేతలపై ఢిల్లీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మంగళవారం అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించడం, అధికారిక విదులను అదుకోవడం, పోలీ సులపై దాడి, దురునుగా ప్రవర్తించడం తదితర ఆరో పణలపై ఎస్ఐఆర్లు నమోదుచేశారు.
రాహుల్ మహిళా పోలీనును అనుచితంగా
తాకారు: బీజేపీ
ఇండి కూటమి నిరసనల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక పోలీసులతో అనుచి తంగా ప్రవర్తించారని బీజేపీ అధికార ప్రతినిధులు ప్రదీప్ భండారీ, సిద్దార్ యాదవ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ ఓ మహిళా కానిస్టేబులు అనుచితంగా తాకారని, ప్రియాంకా గాంధీ ఓ మహిళా పోలీసు అధికారిని కడుపులో కొట్టారని.. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులను కింద వడేసి, కాళ్లతో తన్నారన్నారు.
ఆ నలుగురికీ శిక్ష పడుతుంది: రాహుల్
మోదీ, అమిత్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదని, ఆయనను తప్పించడం మినహా ప్రధాని చేసేదేమీ లేదని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. దేశంలో పవిత్రమైన ఓటు హక్కు కోసమే తాము పోరాడున్నామని చెప్పారు. "800 మంది ఎంపీలం ప్రశాంతంగా ఆందోళన చేయాలను కుంటున్నాం. మొదటి రోజు ఎన్నికల సంఘం కార్యాల యానికి వెళుతుంటే అడ్డుకున్నారు. నిన్న జంతర్‌మం తరకు వెళుతుంటే ఆపేశారు. మా వాళ్లను కొట్టారు. వాళ్లకు శిక్షపడుతుంది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేం దుకు ప్రధాని మోదీ, అమిత్, మోహన్ భాగవత్, జ్ఞానశ్ కుమార్ కుట్రలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి ఓటు చోరీకి పాల్పడ్డారు. కుట్రలతో దేశాన్ని హైజాక్ చేశారు. వారిని న్యాయస్థానం ముందు నిలబెడతాం. వారికి శిక్షపడటం ఖాయం..." అని రాహుల్ పేర్కొన్నారు. కాగా, విపక్షాల ఆందోళ నలు, కాక్రోచ్ జనతా పార్టీ ఈ నెల 10వ తేదీ నుంచి నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో కేంద్రం ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ పోలీసులతో పాటు 221 కంపెనీల పారామిలటరీ దళాలను రంగం లోకి దింపింది.
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు భద్రత పెంపు
ఇండి కూటమి ఆందోళనలు, కాక్రోచ్ పార్టీ కూడా నిరసనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సీఈసీ జ్ఞానే శు మార్కు కేంద్రం భద్రతను మరింత పెంచింది. ఇప్పటికే ఆయనకు అత్యుత్తమమైన జెడ్ ప్లస్ భద్రత ఉండగా.. సిబ్బందిని మరింత పెంచారు. సీఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని జోడించారు.