ముంబయి శివాజీ పార్క్ లో భారీ నిరసన
సర్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలి
జాబితాను మార్చకుండా నిలిపివేయాలి
కాక్రోచ్ జనతా పార్టీ కీలక డిమాండ్..!
ముంబైలో పోటాపోటీ నిరసనలు..
సీజేపీకి వ్యతిరేకంగా 'జెన్ నెక్స్ట్ '
ఆందోళన సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తూ
సీజేపీ ఆందోళన పోటాపోటీ ప్రదర్శనలతో
ముంబైలో ఉద్రిక్తత భారీగా మోహరించిన పోలీసులు, భద్రతా బలగాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో శుక్రవారం కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన జరిగింది. నర్ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న సీజేపీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే అభిజిత్ దీప్కే నేతృత్వంలోని సీజేపీ పిలుపు మేరకు ముంబయి శివాజీ పార్క్ నిరసనకు వేలాది మంది యువకులు, విద్యార్థులు, పౌర సమాజ ప్రతినిధులు తరలివచ్చారు. ఈ ఆందోళనలో గాంధీ కుటుంబానికి చెందిన తుషార్ గాంధీ, ప్రముఖ బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, నసీరు-ద్దీన్ షా, సంగీత దర్శకుడు విశాల్ డడ్లానీ కూడా పాల్గొని మద్దతు తెలిపారు. రాజకీయ పార్టీలు శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీలు కూడా నిరసనకు తమ మద్దతు ప్రకటించాయి. నిరసనకారుల్ని ఉద్దేశించి ప్రసంగించిన సీజేపీ నాయకుడు అభిజిత్ దీప్కే నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అసమర్థంగా ఉందని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిగిన 2 నెలల వ్యవధిలోనే మరోసారి తాము నిరసన చేపట్టాల్సి వచ్చిందని అన్నారు. మరోవైపు సీఈసీ తప్పక రాజీనామా చేయాల్సిందేనని, నేర విచారణ ఎదుర్కోవాల్సిందేనని దాదర్లో జరిగిన నిరసనలో సీజేపీ నాయకుడు అజింక్యా కిందే డిమాండ్ చేశారు. ఇంకా ఢిల్లీ పోలీసులు మళ్లీ క్రూరంగా ప్రవర్తించారని, మారండి లేకపోతే తామే మారుస్తామని సీజేపీ నాయకుడు సౌరవ్ దాస్ హెచ్చరించారు. అంతకుముందు అక్టోబర్ 2న శివాజీ పార్స్లో మధ్యాహ్నం 4 గంటలకు నిరసన చేపడతామని సీజేపీ ముందుగానే హెచ్చరించింది. పోలీసుల నుంచి అనుమతి లభించకపోయినప్పటికీ నిరనన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చింది. నిరసన నేపథ్యంలో శివాజీ పార్క్ పరిసరాల్లో భారీగా పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు. సమీపంలోని దాదర్ రైల్వే స్టేషన్ స్టేషన్ నుంచి వచ్చే మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలోనే యువత శివాజీ పార్క్ వద్ద నిరసన ప్రాంతానికి చేరుకుంది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ త్రివర్ణ పతాకాలతో పాటు వివిధ ప్లకార్డులను ప్రదర్శించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. 2025 ఓటర్ల జాబితాను మార్చకుండా నిలిపివేయాలని కోరుతోంది. ఇటీవల ఎన్నికల కమిషనర్లు సుబ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి- సర్ ప్రక్రియు సంబంధించి కొన్ని నిర్ణయాలు, ఉత్తర్వులపై 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఈ నివేదికల ఆధారంగానే పలు ప్రతివక్ష పార్టీలతో పాటుగా సీజేపీ కూడా సీఈసీ రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోంది. అయితే మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం ఈ ఆరోవణల్ని ఖండించింది. సర్ ప్రక్రియ సహా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలన్నీ ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ ఏకగ్రీవంగానే తీసుకున్నవని స్పష్టం చేసింది. సీజేపీ చేపట్టిన నిరసనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ఎన్నికల సంఘం కమిషనర్లు ఇప్పటికే అన్ని అనుమానాలకు వివరణ ఇచ్చారని, ప్రతివక్షాలు నకిలీ కథనాలు వ్యాప్తి చేస్తున్నాయని, దీనిని ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. మరోవైపు మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత ఆశిష్ షెలార్ కూడా సీజేపీ నిరసనలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఆందోళనలను రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించారు. సర్ ప్రక్రియపై ఏమైనా అభ్యంతరాలు ఉ న్నట్లయితే న్యాయపరంగా, రాజ్యాంగ బద్ధంగా ఎదుర్కోవాలని, వీధుల్లోకి వచ్చి అరాచకం సృష్టించడం సరికాదన్నారు. మరోవైపు ముంబైలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఓవైపు నిరసనలు చేపట్టగా, ట్టగా, మరోవైపు ఆ పార్టీకి వ్యతిరేకంగా 'జెన్ నెక్స్ట్ ముంబై' బృందం కౌంటర్ ప్రదర్శన నిర్వహించింది. ఈ పోటాపోటీ ఆందోళనల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఉ టికే పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీ జయంతి సందర్భంగా సీఈసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీపే పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముంబైలోని శివాజీ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. తమ నిరసనకు ప్రజలు మద్దతు ప్రకటించాలని పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ విజ్ఞప్తి చేశారు.వీరికి ప్రతిగా జెన్ నెక్స్ట్ ముంబై సభ్యులు అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఒక నిరసనకారుడు మాట్లాడుతూ, “అభిజీత్ దీప్కే వంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని అస్థిరవరచాలని చూస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా గౌరవించాలో మాకు తెలుసు. అందుకే బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగానిరసన వ్యక్తం చేస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం" అని స్పష్టం చేశారు ఈ పోటాపోటీ ప్రదర్శనల ప్రభావంతో సోషల్ మీడియాలోనూ ఇరు వర్గాల మద్దతుదారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు జెన్ నెక్స్ట్ మద్దతుదారులు సీజేపీ సభ్యులను 'దిమాగీ నక్సల్స్'గా అభివర్ణించగా, జెన్ నెక్స్ట్ నిరసనల వెనుక బీజేపీ హస్తం ఉందని సీజేపీ వర్గాలు ఆరోపించాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు, భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఓటర్ల జాబితా నవరణ అంశంపై ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సీజేపీ చేస్తున్న ప్రచారం ఏ స్థాయిలో విభేదాలకు దారితీసిందో ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.