ధ్వజారోహణంతో తిరుమలలో వైభవంగా ప్రారంభం
స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
సూడవీధుల్లో పెద్ద శేషుడిపై మలయప్ప చిద్విలాసం
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం 6.21 నుండి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయవ్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. నకల దేవతలను అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి నమేత శ్రీ మలయప్పస్వామివారిని, వరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్న జీయర్, టీటీడీ ఈవో ముద్దాద రవిచంద్ర, కంకణ బట్టర్ వెంకట రాఘవ దీక్షితులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, భాను ప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.