సాత్ సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న అందాల భామ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం మలయాళంలోకి గ్రాండ్‌గా అడుగుపెడుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, నేషనల్ అవార్డు గ్రహీత విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఆపరేషన్ గంగా'లో ఆమె నటిస్తోంది. తాజాగా మోహన్ లాల్‌తో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉ క్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు మరియు పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక 'ఆపరేషన్ గంగ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇక దేశభక్తి మరియు ఉ త్కంఠభరితమైన సన్నివేశాలతో సాగే ఈ కథపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'శ్రీ గోకులం మూవీస్' బ్యానర్‌పై గోకులం గోపాలన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, ఆదిల్ హుస్సేన్ మరియు పార్థిబన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు శాశ్వత్ సచ్ దేవ్ సంగీతం అందిస్తుండగా, సాత్ కొరియన్ న్స్టంట్ డైరెక్టర్ ఓ సీ-యెంగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు.