డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు వర్సెస్ వైకాపా
దూషణలతో బాటిళ్లతో దాడి
శాప్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన వైకాపా శ్రేణులు
మూడున్నర గంటల పాటు హైడ్రామా
బలగాల రంగప్రవేశంతో అదుపులోకి పరిస్థితి
ఫేక్ సర్టిఫికెట్లు అయితే నిరూపించాలని డీఎస్సీ ఉపాధ్యాయుల సవాల్
అమరావతి : మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల రగడ రావణకాష్టంలా రగులుతునే ఉంది. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయు లు ధ్రువపత్రాలు నకిలీవని అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. ఈనేపథ్యంలో సోమవారం విజయవాడలోని శాప్ కార్యాలయం ముట్టడికి వైసీపీ ఇచ్చిన పిలుపు రణరంగంగా మారింది. ఇదే సమయంలో శావ్ కార్యాల యంలో క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ది, శాప్ చైర్మన్, ఎండీలకు వినతిపత్రాలు ఇచ్చేందుకు స్పోర్ట్స్ కోటా ఉపా ధ్యాయులు అక్కడికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ, ఉపాధ్యాయులు పోటా పోటీ నినాదా లకు దిగారు. దీంతో శాప్ కార్యాలయంలో తీవ్ర జద్రిక్తతలు నెలకొన్నాయి, పోలీసు ఆంక్ష లను ఛేదించుకుని శావ్ కార్యాలయంలోకి చొరబడేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెల కొంది. పోలీసులు అడ్డకుంటున్నా లెక్క చేయకుండా వైసీపీశ్రేణులు కోట్లను తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీ నులు వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.. అయినప్పటికీ వైసీపీ శ్రేణులు గేట్లపైకి ఎక్కి శాప్ కార్యాలయంలోకి చొరబడ్డారు. మాజీ మంత్రలు వెల్లంపల్లి శ్రీనివాస్, మేరుగ నాగార్జున, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షడు అవినాష్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు, నకిలీ ధ్రువపత్రాల వినియోగం జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీరికి పోటీగా టీచర్లు తమ గళాన్ని విప్పారు. తమ సర్టిఫికెట్లు మెడల్స్ వర్జీనల్ అని, కావాలంటే పరిశీలనకు, చర్చకు సిద్దం అని ఆరోపణలు చేసి తమను బజారున పెట్టోందని స్పోర్ట్స్ కోటా టీచర్లు పోటాపోటీగా నినాదాలు చేశారు. అంతేకాకుండా తమ సర్టిఫికెట్లను నిరూపి స్తామని, ఆధారాలు అందరం చూపిస్తామని నవాల్ విసిరారు. దీంతో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్మలకు పాల్పడ్డారు. రా...రా.. అంటూ మీసాలు మెలేస్తూ రెచ్చగొట్టారు. అంతేకాకుండా ఉపధ్యా యులపై వాటర్ బాటిళ్లను విసిరారు. ఈ ఘర్షణలు, తోపులాటల్లోఓ ఉ పాధ్యాయుడి తలకు గాయమైంది. రక్తగాయాలతో ఉన్న ఉపాధ్యాయుడిని సహచరులు, పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైసీపీ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారని ఉపాధ్యాయులు ఆరోపించారు. వైసీపీ నేతలను, శ్రేణు లను శాప్ కార్యాలయ పరిసరాల నుంచి తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన తమను వైసీపీ అవమానించడమే కాకుండా ప్రాణాలను తీసేవిధంగా వ్యవహరిస్తోందంటూ ఉపాధ్యాయులు ఆరోపించారు. ఇంకోవైపు వైసీపీ మహిళ నేతలు రప్పా... రప్పా అంటూ రండిరా చూసుకుం దాం అంటూ ఉ పాధ్యాయులకు నవాళ్లు విసురుతూ మరింత గందరగోళాన్ని సృష్టించారు. దీంతో శాప్ కార్యాలయంలో హైటెన్షన్ నెలకొంది. కొందరు ఉ పాధ్యాయులతో పాటు వైసీపీ కార్యాకర్తలు బాహాబాహికి దిగారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హైడ్రామా నడిచింది, మూడున్నర గంటల పాటు సాగిన ఈ గందరగోళానికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, భద్రతాబలగాలు స్వలంగా లాకీలను ఝులిపించి, ఆందోళనకా రులను చెదరగొట్టారు. ఇదిలా ఉంటే డీఎస్సీ రగడ బెజవాడలో భారీ ట్రాఫిక్ జాము దారితీసింది. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి బందరు రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఆందోళన జరుగుతున్నంత సేవు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గుర య్యారు. ఇంకోవైపు ఘర్షణ వాతావరణంతో పరిస్థితి ఎక్కడ అదుపు తప్పుతుందో అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. చివరకు భద్రతా బల గాలు వైసీపీ శ్రేణులను చెదరగొట్టడంతో సాధారణ పరిస్థితి నెలకొంది.