ఐబీఏతో చర్చల తర్వాత యూఎఫ్ బీయూ ప్రకటన
5 రోజుల పని విధానంపై చర్చించేందుకు కమిటీ
అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం గుర్తిస్తాం
అక్టోబరు 2న 'నో యూపీఐ డే'.. రిటైల్ చెల్లింపులకు అవరోధం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సోమ వారం నుంచి మూడు రోజుల పాటు (సెప్టెంబర్ 28-80) నిర్వహించాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె చివరి నిమిషాలో వాయిదా పడింది. ఆదివారం రాత్రి ఈ విషయాన్ని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎల్బీయూ) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ-బ్యాంకుల యాజమాన్యాల ప్రతినిధి సంస్థ)తో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిం చింది. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల శాఖలు యాథావిధిగా పనిచేయను న్నాయి. వారంలో ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని, మరికొన్ని కీలక డిమాండ్లతో యూఎఫ్ బీయూ మూడు రోజుల సమ్మెను తలపెట్టింది. ఉద్యోగులపై పని భారం అధికంగా ఉన్నందున వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకే పనిది నాలు ఉండాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకు ఉద్యోగులకు సెలవులుగా ఉన్నాయి. అదే మాదిరి మిగిలిన అన్ని శనివారాలను సెలవుగా ప్రకటించడంపై చర్చించేందుకు ఐబీఏ, యూఎప్పీయూ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు యూఎప్పియూ ప్రకటించింది. 'ఈ కమిటీ అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తుంది. భాగస్వాములు అందరితో చర్చించి.. కస్టమర్లు సహా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని గుర్తిస్తుంది అని యూఎప్పీయూ తన ప్రకటనలో పేర్కొంది. స్కేల్ 4. అంతకుమించిన అధికారులకు పనితీరు ఆధారిత (ప్రోత్సాహకానికి (పీఎల్ఎ) సంబంధించి పథకం లోనూ నవరణలపై ఐబీఏతో చర్చలు ప్రారంభిస్తామని తెలి పింది. మిగిలిన పెండింగ్ అంశాల పైనా ఇరువర్గాలు సత్వర పరి ష్కారం కోసం చర్చిస్తాయని ప్రక టించింది. ఈ నేపథ్యంలో ప్రతిపా దిత సమ్మెను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కాగా, సమ్మె ప్రభావం ప్రజలపై భారీగా పడకుండా కేంద్రం చొరవతో ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయడం విశేషం.
అక్టోబర్ 2న యూపీఐ బంద్!
అక్టోబర్ 2న షావుల్లో యూపీఐ చెల్లిం పులు నిలిచిపోనున్నాయి. ఎందుకంటే 'ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేష న్(ఏఐఎంఆర్ఎ) అక్టోబర్ 2ను 'నో యూపీఐ డే'గా ప్రకటించింది. అంటే ఆ రోజున దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల రిటైల్ స్టోర్లలో యూపీఐ చెల్లింపులను అనుమతించరు. ఏఐఎంఆర్ఎకి ఇతర రిటైల్ వర్తక సంఘాలు కూడా కొన్ని మద్దతు ప్రకటిం చాయి. రూ.2,000కు మించిన మర్చంట్ యూపీఐ(వర్తకులకు చేసే) చెల్లింపులపై 0.4% ఎండీఆర్‌ను(మర్చంట్ డిస్కౌంట్ రేటు) కేంద్రం ఇటీవలే ప్రకటించడం గమ నార్హం. అక్టోబర్ 15 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీనిని వ్యతిరేకిస్తూ ఏఐఎంఆర్ఎ ఈ నిరసనకు దిగింది. అక్టోబర్ 2న రిటైలర్లు తమ దుకాణాల్లోని యూపీఐ క్యూఆర్ కోడ్బ్బై నల్లటి వస్త్రం కప్పి నిరసన తెలియ జేయనున్నారు.