వెనకుండి నడిపించిన వారికి భారీ మూల్యం తప్పదు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర హెచ్చరిక
విమానంపై దాడి ఉగ్రవాద చర్యే: యూఏఈ
న్యూఢిల్లీ: ప్లైదుబాయ్ విమానం ఘటన వెనుక ఉగ్రవాద చర్యలు ఉన్నాయని, కో-పైలట్‌ను పంపినవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. కో-పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద భావజాలానికి ప్రేరేపితమయ్యాడని, ప్రయాణికులు సహా విమానాన్ని కూల్చివేయాలనే ఉద్దేశంతో ఉన్నాడని అన్నారు. "అతడ్ని పంపిన వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని ఆయన హెచ్చరించారు. భారత కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడికి బయటి వ్యక్తులు ఆదేశించారా? అనేది దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్న తరుణంలో నెతన్యాహు హెచ్చరికలు వెలువడ్డాయి. "సమయం గడిచేకొద్దీ విషయం మరింత స్పష్టమవుతోంది.. నిందితుడు ఇస్లామిక్ తీవ్రవాద భావజాలాన్ని స్వీకరించాడు.. ప్రయాణికులతో సహా విమానాన్ని కూల్చివేయడానికి అతను వచ్చాడు.. అతడ్ని ఎవరైనా పంపారా? అనేది మేము దర్యాప్తు చేస్తున్నాం.. ఒకవేళ పంపినట్టు తేలితే.. వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. బుధవారం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం $1073లో కో-పైలట్.. కాక్పెట్లో భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ఆయుధం దాడి చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. 174 మందితో ప్రయాణిస్తున్న ఆ విమానం.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ముందే 30 సెకన్ల కన్నా తక్కువ వ్యవధిలోనే 34 వేల ఎత్తు నుంచి నుంచి దాదాపు 14,000 అడుగుల మేర కిందకు పడిపోయింది. ఇదిలా ఉండగా, ఒమాన్ జాతీయుడైన కో-పైలట్ వెనుక ఇరాన్ ఉ న్నట్టు అమెరికా, ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ హస్తం ఉండొచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం ఇప్పటి వరకు రాలేదు. దర్యాప్తు జరుగుతోందని, అదే నిజమైతే ఇరాన్‌పై భారీ దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. యూఏఈ అధ్యక్ష సలహాదారు అన్వర్ గర్గాష్ సైతం ఈ దాడిని తీవ్రమైన "ఉగ్రవాద చర్య"గా అభివర్ణించారు. ఆ క్లిష్ట సమయంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, బాధ్యతాయుత ప్రవర్తన వెలకట్టలేనిదని కొనియాడినట్లు న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. తీవ్ర గాయాల పాలైనప్పటికీ పెను ఉగ్ర విలయాన్ని అడ్డుకుని వందలాది ప్రాణాలను కాపాడిన స్మిత్ నిజమైన హీరో అని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఈ ప్రమాదకర ఘటనపై యూపిఈ న్యాయ విభాగం అధికారికంగా విచారణ ప్రారంభించింది. ముందస్తు ప్రణాళికతోనే దాడి చేశారా, ఏదైనా ఉగ్రవాద ముఠాతో సంబంధాలు ఉన్నాయా అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్నందున నిరాధార పుకార్లు, కథనాలు ప్రచారం చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు. పిట్లో జరిగిన పెనుగులాటలో తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా స్మిత్ మచ్చార్ డోర్ లాక్ తెరిచి ప్రయాణికులను కాపాడటంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా దించగలిగారు. ప్రస్తుతం అబుదాబిలో చికిత్స పొందుతున్న స్మిత్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది.