సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సరికొత్త లుక్ తో ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తున్నారు. కొన్నేళ్లుగా గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించిన ఆయస, తాజాగా పూర్తిగా క్లీన్ షేవ్ చేసి మునుపటి కంటే యంగ్ గా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం 'వారణాసి' షూటింగ్లో భాగంగా కాశీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహేశ్, తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యారు. ఆయన కొత్త లుక్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఎయిర్‌పోర్టులో ఎంతో ఉల్లాసంగా కనిపించిన మహేశ్, తనసు ఫొటోలు తీస్తున్న కెమెరాలను చూసి నవ్వుతూ తన గడ్డం వైపు చూపిస్తూ 'గడ్డం లేదు' అన్నట్లుగా చిలిపి సైగలు చేశారు. ఈ దృశ్యాలు చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 61 ఏళ్ల వయసులో కూడా 24 ఏళ్ల కాలేజీ కుర్రాడెలా వెలిగిపోతున్నారంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత మహేశ్‌ను ఇలా క్లీన్ షేవ్‌లో చూడటంతో 'అతడు', 'ఒక్కడు' సినిమాల నాటి లుక్ గుర్తొస్తోందని, ఆ రోజులు మళ్లీ వచ్చేశాయని సంబరపడుతున్నారు. అయితే, మహేశ్ ఈ ఆకస్మిక మార్పు వెనుక బలమైన కారణమే ఉందనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాజమౌళి సినిమా కోసం మహేశ్ గత రెండేళ్లుగా తన శరీరాకృతిని మార్చుకోవడంతో పాటు గడ్డంతో కూడిన రఫ్ గెటప్‌ను కొనసాగిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన రుద్ర అనే ట్రావెలర్‌గా, శ్రీరాముడిగా విభిన్న కోణాల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం సినిమాలో దాదాపు 15 నిమిషాల పాటు సాగే ఒక కీలక ఎపిసోడ్లో మహేశ్ 24 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నారట. ఈ యువకుడి పాత్ర చిత్రీకరణ కోసమే మహేశ్ బాబు క్లీన్ షేవ్ చేసుకున్నారా? లేక కారీ షెడ్యూల్ ముగియడంతో కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఈ లుక్‌లోకి మారారా? అన్నది ఇప్పుడు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. కారణం ఏదైనా మహేశ్ 'ఏజౌన్ హ్యాంద్్సమ్' లుక్ అభిమానులకు పండగలా మారింది. ఈ మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.