కన్నడ నటిగా పాపులారిటీ అందుకున్న ఆషికా రంగనాథ్ తొలిసారి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన అమీగోస్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సినిమా డిజాస్టర్ గా నిలిచినా అందరి దృష్టి అమ్మడి పైనే. తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. మళ్లీ 2026లో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తోంది. కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. దీంతో రూట్ మార్చిన ఈమె.. తమిళంలో తాజాగా నటిస్తున్న చిత్రం సర్దార్ 2. సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో అటు ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు ఇటు సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తూ అలరిస్తోంది. ఈ మేరకు తాజాగా చీరకట్టులో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఆషికా రంగనాథ్. బ్లాక్ అండ్ వైట్ జీబ్రా కలర్స్ తో డిజైన్ చేసిన జార్జెట్ చీర కట్టుకున్న ఈమె.. దీనికి కాంబినేషన్లో పోల్కడాటెడ్ తో డిజైన్ చేసిన డీప్ రౌండ్ నెక్ కలిగిన బ్లౌజ్ ధరించి తన అందాలను ఫుల్ ఫిల్ చేసుకుంది. హైదరాబాదులో సెప్టెంబర్ 7వ జరిగిన సర్దార్- 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇలా ముస్తాబయింది ఈ ముద్దుగుమ్మ, చీర కట్టులో నడుము అందాలతో చక్కగా ప్రేక్షకులను మైమరిపింప చేసిన ఆషికా రంగనాథ్ ఈ ఫోటోలకు క్యాప్షన్ గా సినిమాటిక్ గా ఉ oదా? హైదరాబాదులో సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈ లుక్ అంటూ షేర్ చేసిన క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి అయితే ఆషికా రంగనాథ్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.