గతకొంతకాలంగా వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ... ఐపీఎల్ 2027కు ముందే ఫ్రాంచైజీల మధ్య భారీ ట్రేడ్ చోటుచేసుకుంది. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అ జట్టును వీడి పంజాబ్ కింగ్స్‌లో చేరనున్నాడు. మరోవైపు పంజాబ్ జట్టుకు కీలక బౌలర్‌గా ఉన్న అర్షదీప్ సింగ్ ముంబయి ఇండియన్సు మారనున్నాడు. ఈ రెండు జట్ల మధ్య ఆటగాళ్ల మార్పిడి పూర్తయింది. దీనిపై గతకొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ దీన్ని అధికారికంగా ప్రకటించింది. హార్దిక్ పాండ్యాకు ముంబయి ఇండియన్స్ సుదీర్ఘ అనుబంధం ఉంది. 2015లో తొలిసారి ఆ జట్టులో చేరిన అతడు.. 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ సాధించిన జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఏడు సీజన్ల పాటు ముంబయి తరఫున ఆడిన తర్వాత 2022లో గుజరాత్ టైటాన్సు మారాడు. తొలి సీజన్లోనే కెప్టెన్‌గా ఆ జట్టుకు టైటిల్ అందించాడు. 2023 లోనూ గుజరాత్ ఫైనల్‌కు చేరింది. 2024లో తిరిగి ముంబయికి వచ్చిన హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. హార్దిక్ ఇప్పటివరకు 162 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 2,955 పరుగులు చేయడంతో పాటు 82 వికెట్లు పడగొట్టాడు. 146.28 స్ట్రైక్తేట్తో బ్యాటింగ్ చేశాడు. ముంబయిలో రూ.16.35 కోట్ల పారితోషికం అందుకున్న అతడు.. ఇప్పుడు రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ లో చేరనున్నాడు. 2019లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అర్షదీప్ సింగ్.. ఎనిమిది సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 96 మ్యాచ్ ల్లో 111 వికెట్లు పడగొట్టాడు. 2025 సీజన్లో 21 వికెట్లు తీయగా.. 2026లో 14 వికెట్లు సాధించాడు. కొత్త బంతితో వికెట్లు తీయడంలో, చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో అతడు దిట్ట. ఇప్పుడు రూ.18 కోట్ల పారితోషికంతో ముంబయి జట్టులోకి అడుగుపెట్టనున్నాడు.