హిముంగ్ హిమల్ బేస్ క్యాంప్ 10 మంది గల్లంతు
ఖాట్మండు: నేపాల్లోని మనాంగ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టిబెట్ సరిహద్దుకు సమీపం లోని హిమ్లుంగ్ హిమల్ పర్వత బేస్ క్యాంప్ఫై ఆదివారం ఉదయం భారీ హిమపాతం నిరుచుకుప డింది. ఈ ఘటనలో కనీసం 10 మంది పర్వతారోహకులు, సహాయ క సిబ్బంది గల్లంతైనట్లు యాత్ర నిర్వాహకులు వెల్లడిం చారు. గల్లంతైన వారిలో హిమాలయన్ హాలిడేస్ నేపాల్ కు చెందిన ఎనిమిది మంది సిబ్బంది, ఇమాజిన్ నేపాల్ ట్రెక్స్కు చెందిన ఇద్దరు కిచెన్ సిబ్బంది ఉన్నట్లు అధికా రులు తెలిపారు. భారీ మంచు కింద బేస్ క్యాంప్ లోని టెంట్లు కూరుకుపోయినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీగా మంచు, వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు విషమించడం తో పర్వతారోహణ బృందాల్లో చాలామంది ఇప్పటికే దిగువ ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే కొందరు సిబ్బంది. బేస్ క్యాంప్ లోనే ఉండగా హిమపాతం సంభవించింది. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా చేరుకోవడం కూడా క్లిష్టంగా మారింది. నేపాల్ పర్యాటక శాఖ ఇప్పటికే సర్వకారా "హణ, ట్రెక్కింగ్ కార్యకలా పాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించింది. గల్లంతైన వారి కోసం అధికారులు, యాత్ర నిర్వాహకులు వివరాలు సేకరిస్తూ- సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.