రూ.22,177 కోట్ల పెట్టుబడులు.. 19,739 మందికి ఉపాధి
తీరం మొత్తం పోర్టు మౌలిక వసతుల అభివృద్ధి..
సెమీకండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్‌కు ప్రాధాన్యం
రేర్ ఎర్త్ మినరల్స్ పై ప్రత్యేక దృష్టి..
ఎగుమతుల్లో జిల్లాలను టాప్-5లోకి తీసుకెళ్లేలా చర్యలు
పోర్టులు, రైలు, రోడ్డు, ఎయిర్ కార్గో, జలరవాణాను అనుసంధానించి
ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దాలి ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, : ఆంధ్రప్రదేష్ ను దేశంలోనే కీలకమైన హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు, తీర ప్రాంతం పొడవునా పోర్టు మౌలిక వనతులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. మొత్తం 28 పారిశ్రామిక వ్రతిపాదనలకు సంబంధించి రూ.22,177.84 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇంధన రంగం, ఐటీ, కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, పర్యాటక రంగాలకు చెందిన వివిధ ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు. ఏపీని దేశంలోనే ప్రముఖ హార్డ్‌వేర్ తయారీ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సెమీకండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చొప్పర్తి, తిరుపతి, లేపాక్షి వంటి ఎలక్ట్రానిక్స్ హబ్‌లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా అవసరమైన మౌలిక వనతులు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కేవలం ఎలక్ట్రానిక్స్ తయారీతో ఆగకుండా పరిశోధన, డిజైన్, తయారీతో కూడిన పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. సోలార్ ప్యానెళ్ల తయారీతో పాటు వాటికి అవసరమైన అనుబంధ పరిశ్రమలు, సాంకేతికత, నైపుణ్యాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, హైపెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో పరిశోధన, తయారీ సంస్థలు వేగంగా ఏర్పాటయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. డ్రోన్, స్పేస్ సిటీల సమీపంలో ఆయా రంగాలకు అనుబంధంగా ఉండే క్లస్టర్ పరిశ్రమలు ఏర్పడేలా నమగ్ర ప్రణాళిక రూపొందించాలని మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు తైవాన్‌తో సంప్రదింపులు జరువుతున్నట్లు మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు తెలిపారు. పెట్టుబడులకు ఆమోదం తెలిపిన తర్వాత ప్రాజెక్టులు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించేలా పర్యవేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు ఆరు నెలల గడువు విధించి, 58 వ్యవధిలోగా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు.
పోర్టు భూముల సమర్థ వినియోగం
రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద ఉన్న భూమిని వాణిజ్యపరంగా సమర్ధవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. పోరుల అభివృద్ధితో పాటు వాటి చుట్టూ లాజిస్టిక్స్, షిప్‌బిల్డింగ్, గోదాములు, తయారీ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఫిషింగ్ హార్బర్లను కూడా అభివృద్ధి చేయాలని అన్నారు. కార్గో షిప్‌ల నిర్మాణంతో పాటు డిఫెన్స్, టూరిజం అవసరాలకు అనుగుణంగా షిప్ బిల్డింగ్ కార్యకలాపాలను రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
లాజిస్టిక్స్ హబ్ ఏపీ
పోర్టులు, షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్, పరిశ్రమలను అనుసంధానించే సామగ్ర ఎకోసిస్టమ్న ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. లాజిస్టిక్స్ రంగంపై విస్తృతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్స్ హణా అభివృద్ధి చేయాలని అన్నారు. పోర్టులు, రైలు, రోడ్డు ఎయిర్ కార్గో, అంతర్గత జలరవాణా వంటి అన్ని రవాణా మార్గాలను అనుసంధానం చేసి సమగ్ర లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
ఎగుమతుల్లో తిరుపతికి 10వ స్థానం
క్రిసిటీతో తిరువతి జిల్లా ఎగుమతుల్లో దేశంలోనే 10వ స్థానంలో నిలిచిందని సీఎం వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా 12వ స్థానంలో ఉందని, ఎగుమతుల్లో టాప్-5 లోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర యువత నైపుణ్యాల్లో అగ్రస్థానంలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. 10వ తరగతి నుంచే స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి సారించాలని సూచించారు. దీనిపై స్కిల్ మ్యాపింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పీఎం సేతును కూడా అనుసంధానం చేసుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. విశాఖపట్నంలోని అదానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నైపుణ్య శిక్షణతో పాటు సివిల్ ఏవియేషన్ సహా ఎంఆర్ ఫెసిలిటీని కూడా అభివృద్ధి చేస్తున్న విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేందుకు ఇలాంటి అవకాశాలను విస్తరించాలని సూచించారు. మెటీరియల్ రీసెర్చ్ కూడా అత్యంత కీలకమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భవిష్యత్ తయారీ పరిశ్రమ లకు అవసరమైన పరిశోధన, సాంకేతిక నైపుణ్యాలు, మానవ వనరులను అభివృద్ధి చేయాలని సూచించారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
సిమెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు కొన్ని సిమెంట్ కంపెనీలు ముందుకు వచ్చినట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలు, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను వరిశీలించి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. అగ్రి ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో మహిళలు మరింతగా పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎంఎన్ఎంఈలు విస్తృతమయ్యేలా 'వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్' విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
రేర్ ఎర్త్ మినరల్స్ప ప్రత్యేక దృష్టి
రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ఆంధ్రప్రదేశు హబ్ తయారు చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఆధారిత ప్రాసెసింగ్, విలువ ఆధారిత పరిశ్రమలు, పరిశోధన, తయారీ రంగాలను అనుసంధానం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం
టీటీడీ పరిధిలోని భవనాలపై సౌర, పవన విద్యుత్ ఉ త్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించారు. వంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వంటి ప్రత్యామ్నాయాల వైపు మళ్లాలని సూచించారు. టీటీడీలో నెట్రో లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు చేపట్టాలని, ఎలక్ట్రిక్ బస్సులు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 511 చార్జింగ్ స్టేషన్లకు అనుమతులు ఇచ్చినట్లు సమావేశంలో వెల్లడించారు. ఆనోషోర్ విండ్‌మిల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను కూడా పరిశీలించాలని సీఎం సూచించారు. గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రం నిర్దేశించుకున్న 160 గిగావాట్ల లక్ష్యానికి గాను ఇప్పటికే 113.75 గిగావాట్లకు సంబంధించి పెట్టుబడులు సాధించినట్లు అధికారులు వివరించారు. డిసెంబర్ 17, 18 తేదీల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో హైడ్రోజన్ వ్యాలీ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవంబర్‌లో జరిగే భాగస్వామ్య సదస్సు సందర్భంగా పెట్టుబడిదారులకు అందించే ప్రోత్సాహకాల కోసం ఎస్ర్కో ఖాతాల ఏర్పాటుపై చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
హోటళ్ల ఏర్పాటుకు ప్రోత్సాహం
ఆతిథ్య రంగంలో హోటళ్లు పెద్దఎత్తున ఏర్పాటయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించాలన్నారు. విశాఖలో భాగస్వామ్య సదస్సుకు మరో 50 రోజులు మాత్రమే నమయం ఉందని, అప్పటిలోగా గతంలో కుదిరిన ఒప్పందాలు గ్రౌండ్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐపీబీ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్ సాయి ప్రసాద్ పాటు పరిశ్రమలు, ఐటీ, ఐఅండ్బ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.